తెలంగాణ

రాజ్యసభ టికెట్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: రాజ్యసభ సభ్యత్వం కోసం టిఆర్‌ఎస్ నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు రెండూ ఏకగ్రీవంగా వచ్చే అవకాశం ఉంది. దాంతో టికెట్ కోసం ప్రయత్నించే నాయకుల సంఖ్య పెరిగింది. నామినేషన్ దాఖలు చేసేందుకు పది మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్‌కు ఆ మాత్రం బలం ఉంది కానీ ఎన్నికల్లో పోటీ చేసేంత బలం, ఆసక్తి ఆ పార్టీలో కనిపించడం లేదు. పైగా టిఆర్‌ఎస్‌కు పూర్తి బలం ఉండడంతో పోటీ అనవసరం అనే భావన అన్ని పార్టీల్లో ఉంది. ఇతర పార్టీల ఓట్లు టిఆర్‌ఎస్‌కు పడే అవకాశం ఉంది కానీ టిఆర్‌ఎస్ ఓట్లు రాజ్యసభ ఎన్నికల్లో మరో పార్టీకి మళ్లే అవకాశం లేదు. దాంతో కాంగ్రెస్ పోటీకి విముఖత చూపుతోంది.
పలువురు నాయకులు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును క్యాంపు కార్యాలయంలో కలుస్తున్నారు. అయితే కెసిఆర్ మాత్రం ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యత్వంపై ఎలాంటి చర్చ చేయలేదు. రెండు స్థానాల్లో ఒకటి బిసి ఒకటి రెడ్డి అభ్యర్థికి ఆవకాశం ఇవ్వవచ్చునని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే పిసిసి అధ్యక్ష పదవి నిర్వహించిన డి శ్రీనివాస్ ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ ముఖ్య ప్రతినిధిగా ఉన్నారు. గతంలో పిసిసి అధ్యక్ష పదవి నిర్వహించి ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్‌లో చేరిన కె కేశవరావుకు రాజ్యసభ సభ్యత్వం కల్పించినందున డి శ్రీనివాస్‌కు సైతం రాజ్యసభ సభ్యత్వం లభించవచ్చుననే ప్రచారం పార్టీలో సాగుతోంది. తెలంగాణలో రాజకీయంగా బలమైన సామాజిక వర్గం రెడ్డి వర్గానికి రాజ్యసభలో అవకాశం కల్పించవచ్చునని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శిగా ఉన్న శేరి సుభాశ్‌రెడ్డి రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్నారు. వరంగల్‌లో పార్టీ సాధారణ నేత పసునూరి దయాకర్‌ను పోటీకి నిలబెడితే రికార్డు స్థాయిలో మెజారిటీ లభించింది. అదే తరహాలో రాజ్యసభకు మొదటి నుంచి పార్టీలో ఉన్న వారినే ఎంపిక చేస్తే సానుకూల సంకేతాలు వెళతాయనే అభిప్రాయం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు పారిశ్రామికవేత్తలు రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్నా పార్టీ నుంచి వారికి సానుకూలత వ్యక్తం కావడం లేదు. పొరుగు రాష్ట్రంలో రాజ్యసభ సభ్యత్వం, లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు ఎక్కువగా పారిశ్రామికవేత్తలకే ఇవ్వడం వల్ల పార్టీ విమర్శల పాలైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ వర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.
కెప్టెన్ లక్ష్మీకాంతరావు ముఖ్యమంత్రిని కలిసి రాజ్యసభ సభ్యత్వం కోసం తన పేరు పరిశీలించాలని కోరారు. ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్నారు. పారిశ్రామికవేత్త సిఎల్ రాజంకు రాజ్యసభ సభ్యత్వం కల్పించనున్నట్టు కెసిఆర్ గతంలో ప్రకటించారు. అయితే తెలంగాణ ఏర్పడిన వెంటనే రాజం బిజెపిలో చేరారు. తిరిగి బయటకు వచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సభ్యత్వం కోసం రాజం ప్రయత్నిస్తున్నారు.