తెలంగాణ

రాములమ్మా! నీ భవితవ్యం ఏమిటమ్మా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 24: ‘ఒసేయ్ రాములమ్మ’ పేరు చెబితే అక్షర జ్ఞానం అంతంత మాత్రంగా ఉన్న మారుమూల గ్రామాలకు చెందిన సాధారణ వ్యక్తులు ఎవరైనా క్షణంలో గుర్తుపట్టి సినీ నటి విజయశాంతి అని చెప్పగలరు. గడప గడపకు, గుండె గుండెకు తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న విజయశాంతి రాజకీయంగానూ అంతే పేరు సంపాదించుకున్నారు. గల్లీ నుండి దిల్లీ వరకు తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న ఆమె గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా జన జీవనంలోకి రాకుండా దూరంగా ఉండిపోవడంతో ఆమె రాజకీయ భవిషత్తు ఏమిటా? అన్న ప్రశ్నలు అన్ని వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభానికి ముందు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆయా ఎన్నికల్లో సెలబ్రెటీగా ప్రాచారం నిర్వహించారు. మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యాక తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు తనకు తానుగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమ పార్టీలను కూడగట్టిన నేపథ్యంలో గులాబి దళపతి కేసీఆర్ విజయశాంతిని కూడా తనవైపు తిప్పుకున్నారు. కేసీఆర్ షరతులను ఏకీభవించిన విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేసారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో విజయశాంతి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఘన విజయం సాధించారు.
అనంతరం టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్‌తో విభేదాలు ఏర్పడటంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెనువెంటనే సార్వత్రిక ఎన్నికల నగారా మ్రోగడంతో ఎంపీ స్థానాన్ని వదులుకుని మెదక్ అసెంబ్లీ స్థానంపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ సంపాదించుకున్న విజయశాంతి తాజా సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డికి గట్టి పోటీని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలే తన ఓటమికి కారణమన్న అక్కసుతో విజయశాంతి ఉన్నారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి మళ్లీ బరిలోకి దిగుతారా? లేదా? అన్న చర్చ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకన్నా అధికార టీఆర్‌ఎస్‌లోనే ఆసక్తికరమైన చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డిపై పార్టీ శ్రేణులతో పాటు ద్వితీయ శ్రేణి నేతలంతా అలక వహిస్తుండటంతో బరిలోకి విజయశాంతి దిగితే పరిస్థితి ఏమిటన్న విషయమై ఆలోచనలో పడినట్లు సమాచారం. కాగా, విజయశాంతి మాత్రం ఈసారి ఎన్నికల బరిలోకి దిగకుండా టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర ప్రచారం చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు రాష్ట్ర ప్రచార బాధ్యతలను అప్పగించాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి విన్నవించినట్లు తెలిసింది. ప్రస్తుతానికి రాష్ట్ర స్థాయిలో ఆయా కమిటీలను నిమయమించుకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మిన్నకుండిపోవడంతో నాయకులను, కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది. మెదక్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం పోటీ చేసేందుకు ముగ్గురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుప్రబాతరావులు ఉన్నారు. వీరిలో విజయశాంతి సుప్రబాతరావుకు పూర్తి ఆశిస్సులు అందిస్తూ అతనికే టికెట్ లభించేలా ఏఐసీసీపై వత్తిడి తీసుకువస్తారన్న చర్చ ప్రధానంగా కొనసాగుతుంది. మెదక్ కాంగ్రెస్ రాజకీయ భవిషత్తు మొత్తం ఓసేయ్ రాములమ్మపైనే ఆదారపడినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయం ఆసన్నమైతే రాములమ్మ రాజకీయ భవితవ్యం ఏమిటన్నది స్పష్టం కానుంది.

చిత్రం..మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి