తెలంగాణ

అభివృద్ధిలో ఆదర్శం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 24: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ ఆదర్శనీయమని.. ఇచ్చిన మాట మేరకు నల్లగొండ, సూర్యాపేటలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేయడంతో వెనుకబడిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రగతి ముందడుగు వేయనుందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు నల్లగొండలో 275కోట్లతో 150సీట్ల మెడికల్ కళాశాల మంజూరైందని, జూన్ 15వ తేదిలోగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం ఆసుపత్రి ఏర్పాటును పరిశీలించిన పిదప 2019-20సంవత్సరానికిగాను అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 560పడకల సామర్ధ్యంతో ఆసుపత్రి ఉన్నందునా ఇక్కడే ఆసుపత్రి ఏర్పాటు జరుగుతుందన్నారు. ఆసుపత్రి ఏర్పాటులో ఎవరికి ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తావులేదని నాకు నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎక్కడా భూమి లేదన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో రెండు మెడికల్ కళాశాలల ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు తాను ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. సీఎం కేసీఆర్ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతు పంపిన లేఖపై కోమటిరెడ్డి స్పందించిన తీరు సంస్కారహీనంగా ఉందన్నారు.
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వ్యిక్తికి తిరిగి హుందాగా ధన్యవాదాలు తెలుపాల్సిందిపోయి కేసీఆర్‌ను గద్దె దించుతామంటు నీ పాలన అంతం చేస్తామంటు అసందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి తీరు ఆయన పిచ్చి ప్రేలాపనలకు అద్దం పట్టిందన్నారు. అలాగే, రాష్ట్రంలో రైతుబంధు పథకం అమలుకు రైతాంగం నుండి భారీ సానుకూల స్పందన వచ్చిందన్నారు. రైతులు పెట్టుబడి సొమ్మును సద్వినియోగం చేసుకుని పంటల సాగు చేపట్టి అప్పులకు దూరంగా లాభసాటి వ్యవసాయం సాగించాలన్నారు. మిగిలిపోయిన, తప్పులు చోటుచేసుకున్న చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నేటి నుండి జూన్ 26వరకు కొనసాగిస్తారన్నారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తారని, మంత్రి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ప్లానింగ్ కమిటీ చైర్మన్‌లు సైతం పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తారన్నారు. రైతుపాస్ పుస్తకం పేజీ నెంబర్ 1లో ఆధార్ నెంబర్ తప్పు ఎంట్రీతో సాగిన పొరపాట్లను, భూమి తక్కువ, ఎక్కువ నమోదు వివరాలను సరిచేసి పాస్‌పుస్తకాల పంపిణీ కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. ఎన్నారైల పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీకి చీఫ్ సెక్రటరీ స్థాయిలో కమిటీ పర్యవేక్షించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.
రైతులకు ఈ ఖరీఫ్‌లో 18లక్షల టన్నులు ఎరవులు, 14లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరముండగా ఇప్పటికే మండలాల్లో మూడున్నర లక్షల టన్నుల ఎరువుల బఫర్ స్టాక్, ఏడున్నర లక్షల సబ్సిడీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. డిమాండ్ మేరకు మిగతా వాటి సరఫరా కూడా కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి పాశం రాంరెడ్డి, దైద రజిత, జడ్పీటీసి తుమ్మల రాధ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి