తెలంగాణ

సొమ్మూ మనదే.. సోకూ మనదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొమ్ము మనది సోకు ఆంధ్రా పాలకులది ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సొమ్ము మనదే.. సోకు మనదే అని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో డబుల్ బెడ్‌రూం, శివాలయం పునర్‌నిర్మాణానికి శంకుస్థాపనలు చేయగా, కమ్యూనిటీ భవనాన్ని, ఓ ప్రైవేటు పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పొత్తూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించగా, 17 సంవత్సరాలు టీడీపీ పాలించగా అప్పుడు ఆ ప్రభుత్వాలు ఏం చేశాయో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో ఏం చేసిందో ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు. నాడు 200 రూపాయల పెన్షన్ ఉంటే నేడు వెయ్య రూపాయల వృద్ధాప్య పెన్షన్ టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. అవసరమున్న దగ్గర తల్లిలాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మధ్యమానేరు పూర్తి కావస్తున్నా దిగువన ఉన్న పొత్తూరు, కట్కూరు, మానువాడలో వేసిన పంటలు ఎండిపోతాయని రైతులు భయాందోళనలు చెందిన సమయంలో మధ్యమానేరు నుంచి నీటిని వదిలి రైతులను ఆదుకున్నామన్నారు. మధ్య మానేరుతో వచ్చే సంవత్సరం నుంచి రెండు పంటలకు నీళ్లు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు పంట రుణాన్ని నాలుగు విడతలుగా లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం రుణమాఫీ ఇచ్చిందన్నారు. అంతేకాకుండా పంట పెట్టుబడికి ఎకరానికి నాలుగు వేల చొప్పున సంవత్సరానికి ఎనిమిది వేలు ప్రభుత్వం రైతులకు ఇచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. పంట పెట్టుబడికి ప్రభుత్వం ఎక్కడి నుండి డబ్బులు తెస్తుందని కొందరు విమర్శించినప్పటికీ రైతుల్లో పంట పెట్టుబడికి పైసలు అందుకోగానే వారిలో ఆనందం వెలిబుచ్చుతున్నారని పేర్కొన్నారు. పొత్తూరు గ్రామానికి కావాల్సిన అన్ని వౌలిక వసతులకు నిధులను మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తదనంతరం మధ్య మానేరు జలాశయాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జడ్పీటీసీ సిద్ధం వేణు పాల్గొన్నారు.

చిత్రం..పొత్తూరు సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్