తెలంగాణ

పాలమూరులో పిడుగుల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: భారీ శబ్దాలు.. ఆకాశం నుంచి నేలను తాకే మెరుపులు.. సుడిగాలులు.. దాంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి... భయభ్రాంతులకు గురైన సంఘటనలు మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం సాయంత్రం నుండి రాత్రి పొద్దుపోయే వరకు చోటు చేసుకుంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దానికి తోడుగా భారీ గాలులు వీచాయి. ఈ కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దేవరకద్ర, మహబూబ్‌నగర్ మండలాల్లో పిడుగులతో కూడిన వర్షం పడింది. దేవరకద్ర మండల పరిధిలోని ఆజిలాపపూర్ గ్రామంలో పిడుగుపాటు గ్రామానికి చెందిన మేకల కాపరి బోయ శేఖర్ (22) అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. మేకలను మేత మేపుతుండగా భారీ వర్షం రావడం ఇంతలోనే పిడుగుపడటంతో శేఖర్‌తో పాటు ఐదు మేకలు అక్కడికక్కడే చనిపోయాయి. అదేవిధంగా మహబూబ్‌నగర్ మండలం కోటకదిర గ్రామంలో కూడా భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు గురై దుబ్బ మల్లమ్మ (45) అనే మహిళా రైతు తన పొలంలో మృత్యువాత పడింది. పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా వర్షం రావడంతో మల్లమ్మ చెట్టు కిందకు వెళ్లింది. ఇంతలోనే భారీ శబ్దం రావడంతో పిడుగు పడటం దాంతో చెట్టు కింద తలదాచుకున్న మల్లమ్మ కుప్పకూలిపోవడం వంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని చుట్టు పక్కల రైతులు గమనించి సంఘటన స్థలం దగ్గరకు పరుగులు తీసుకుంటూ వెళ్లి చూసేసరికి విగత జీవిగా పడిపోయింది మల్లమ్మ. గూరకొండ గ్రామంలో భారీ చెట్లు నేలపై విరిగిపడ్డాయి. దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నవాబుపేట మండల కేంద్రంలో భారీ వర్షం, దీనికి తోడు విపరీతమైన సుడిగాలి రావడంతో గ్రామంలో విద్యుత్ స్తంభాలు నెలకూలి వైర్లు తెగిపడ్డాయి. దాంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ళల్లోకి పరుగులు తీశారు. వ్యవసాయ మార్కెట్ యార్డు అవరణలో పెద్దపెద్ద చెట్లు కూలిపోయి చెట్ల కింద ఉన్న కార్లపై పడ్డాయి. దాంతో నాలుగు వాహనాలు పూర్తి దెబ్బతిన్నాయి. గూరకొండ గ్రామంలో రోడ్లపై చెట్టు కూలడంతో చెట్ల కింద ఉన్న ఆటోలు ధ్వంసమయ్యాయి. దామరగిద్ద మండల కేంద్రంలో పిడుగుపాటుకు గ్రామానికి చెందిన తిమ్మప్ప(35) అనే రైతు తన వ్యవసాయ పొలంలో చనిపోయాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక్కసారిగా మెరుపువచ్చి భారీ శబ్దంతో కూడిన పిడుగుపడింది. దాంతో ఆయన తన పొలంలోనే అక్కడికక్కడే మృతి చెందాడు. కోయిలకొండ, నారాయణపేట పట్టణాల్లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో వివిధ గ్రామాలలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడం జరిగింది. వ్యవసాయ పొలాల్లో సైతం విద్యుత్ స్తంభాలు కూలి వైర్లు తెగిపడటంతో విద్యుత్ సరఫరా పలు గ్రామాలకు నిలిచిపోయింది. దాంతో వివిధ మండలాల్లోని పలు గ్రామాలు చీకట్లో ఉండిపోయాయి. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న మామిడి రైతులకు ఈ గాలి మరింత నష్టం చేకూరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా వివిధ గ్రామాల్లో పిడుగు పాటుకు రైతులు వ్యవసాయ పొలాల్లోనే కుప్పకూలిపోయి మృత్యువాత పడటంతో అయా గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
చిత్రం.. మహబూబ్‌నగర్ జిల్లాలో పిడుగుపాటుకు మృతి చెందిన కోటకదిర గ్రామానికి చెందిన మల్లమ్మ