తెలంగాణ

ఎప్పటికీ మార్గదర్శి వివేకానంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: భారతీయతను ప్రపంచానికి చాటిన ధీశాలి స్వామి వివేకానంద అని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు కొనియాడారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ గ్రామంలోని స్వర్ణ్భారతి ట్రస్టులో శుక్రవారం నాడు జరిగిన ప్రతిభా పురస్కార కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శిక్షణార్థులకు ధృవపత్రాల ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. యువశక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని వివేకానందుడు పేర్కొన్నారని ఉప రాష్టప్రతి గుర్తచేశారు. లే..మేలుకో...గమ్యం చేరేవరకూ విశ్రమించకు అన్న ఉపనిషత్ శ్లోకాన్ని స్వామి వివేకానందుడు దేశంలోని మూలమూలలకూ చేర్చారని అన్నా రు. యువతకు స్ఫూర్తిమంతంగా నినదించారని, భవిష్యత్‌తో వికసించే నవ్యమైన భారతాన్ని నిర్మించే క్రమం లో దేశ యువజనులకు ఆ మాటలే మేలుబాటలు కావాలని వెంకయ్య ఆకాంక్షించారు. యువజనులంతా మనస్ఫూర్తిగా పరిశ్రమిస్తే మార్పు సాధ్యమవుతుందని స్వామి వివేకానంద చెప్పారని, అన్నారు.