తెలంగాణ

జోనల్ వ్యవస్థపై అన్ని పార్టీలతో చర్చించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్నా ఇంత వరకూ పరిపాలన గాడిలో పడలేదని, కొత్తగా ఏర్పడ్డ జిల్లాల పునర్విభజన అంశం పూర్తిగా ప్రహసనంగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. జిల్లాల పునర్విభజన టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ అవసరాలు కోసం ఏర్పాటు చేసిన కారణంగా క్షేత్రస్థాయిలో పరిపాలన అంతా అస్తవ్యస్థంగా ఉందని అన్నారు. జిల్లాల్లో కార్యాలయాలకు భవనాలు ఏర్పడలేదని, రెవిన్యూ వ్యవస్థ అస్తవ్యస్థం అయిపోయిందని అన్నారు. రాష్టప్రతి ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణలో జోనల్ వ్యవస్థపునర్‌వ్యవస్థీకరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటులో రాజకీయ పక్షాలతోనూ, ప్రభావితం అయ్యే వర్గాలతోనూ చర్చించి నిర్ణ యం తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.