తెలంగాణ

28 నుంచి కాంగ్రెస్ సేవాదళ్ సైకిల్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ (ఆవిర్భావ దినోత్సవం) వరకు సైకిల్ యాత్రలు నిర్వహించాలని కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ కనుకుల జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. కనుకుల పిలుపు మేరకు కరీంనగర్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ గోలివాడ ప్రసన్న కుమార్ ఈ నెల 28 నుంచి సైకిల్ యాత్ర నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కనుకులను కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆరు రోజుల పాటు సైకిల్ యాత్ర నిర్వహిస్తామని, 28న రామగుండంలో యాత్ర ప్రారంభమై సుల్తానాబాద్‌కు చేరుకుంటుందని ప్రసన్నకుమార్ తెలిపారు. మర్నాడు 29న సుల్తానాబాద్ నుంచి బెజ్జంకి వరకు, 30న బెజ్జంకి నుంచి సిద్దిపేట వరకు, 31న సిద్దిపేట నుంచి గజ్వేల్ వరకు, జూన్ 1న గజ్వేల్ నుంచి హైదరాబాద్ జెబిఎస్ వరకు, 2న రాష్ట్రావతరణ దినోత్సవం నాడు జెబిఎస్ నుంచి నాంపల్లిలోని గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి శాంతియుతంగా సైకిల్ యాత్ర నిర్వహిస్తామని ప్రసన్న కుమార్ తెలిపారు. కనుకుల మాట్లాడుతూ సైకిల్ యాత్రకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించామని చెప్పారు.