తెలంగాణ

వచ్చే నెల 2న రాష్ట్ర అవతరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: రాష్ట్ర అవతరణ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకూ రూ.10 లక్షల చొప్పున కేటాయిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఎ. చందూలాల్ తెలిపారు. శుక్రవారం మంత్రి చందూలాల్ ములుగు నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
పాఠశాలలు జూన్ 1న ప్రారంభిస్తున్నందున, పాఠశాల విద్యార్థులనూ ఉత్సవంలో భాగస్వాములుగా చేయాలని, మూడు రోజుల పాటు పాఠశాలల్లో ఉత్సవాలను నిర్వహించాలని అన్నా రు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పాఠశాలల ఆవరణలోనే వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. అవతరణ దినోత్సవం రోజున విద్యార్థులకు మిఠాయిలు పంచాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం సచివాలయం నుంచి మాట్లాడుతూ కళాజాతరలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. జిల్లాకు కేటాయించిన 10 లక్షల రూపాయలలో 2 లక్షల రూపాయ లు సాంస్కృతిక కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన తెలిపారు.
ప్రతి జిల్లాలో 11 రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి ఒక్కొక్క జిల్లా నుంచి 12 అవార్డులను ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రతి అవగార్డుకు రూ.51,116 ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లకు అదనంగా 686 వృద్ధ కళాకారులకు నెలకు రూ.1500 చొప్పున పెన్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు.