తెలంగాణ

బీజేపీ కార్యాలయం ముట్టడి, ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసినందుకు నిరసనగా తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో బిజెపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు మాలమహానాడు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టం పూర్వస్థితికి తీసుకు వచ్చి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిజెపికి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఆ పార్టీని భూ స్ధాపితం చేస్తామని హెచ్చరించారు. దేశంలో ఉన్న బిజెపిలోని దళిత ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆ పార్టీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి పాలన వచ్చిన తర్వాత దేశంలో దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ వేముల సంఘటన మొదలుకుని ఎన్నో సంఘటనలు జరిగాయని అన్నారు.