తెలంగాణ

వారసత్వ రైల్వే టెర్మినల్‌గా కాచిగూడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: నగరంలో పురాతన రైల్వే స్టేషన్‌గా పేరున్న కాచిగూడ రైల్వే స్టేషన్ తాజాగా ఆధునాతన హంగులను సంతరించుకుంది. నగరంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ల కంటే కాచిగూడ స్టేషన్ సకల సౌకర్యాలు, భారీ మార్పులతో పాటు సంప్రదాయ, పురాతన కట్టడంతో వారసత్వ రైల్వే టెర్మినల్‌గా నిలిచింది. ఈ స్టేషన్ పూర్వం 1916లో స్థాపించిన ‘నిజామ్స్ గ్యారెండీట్ స్టేట్ రైల్వేస్’కి ప్రధాన కార్యాలయంగా పనిచేసి గణనీయమైన గుర్తింపు పొందింది. ఇప్పుడు హైదరాబాద్ రైల్వే డివిజన్‌కి ప్రధాన కేంద్రంగా కాచిగూడ రైల్వే స్టేషన్ చేస్తోంది. పూర్వం భారతీయ, గొతిక్ వాస్తు శిల్ప నిర్మాణాల సౌందర్యాలను ప్రతిబింభిస్తూ 100 సంవత్సరాల నుంచి సేవలను అందిస్తూ వేలాది మంది ప్రయాణీకులను తమ గమ్యస్ధానాలను చేరుస్తోంది. ఆనాటి శిల్ప కళా సౌందర్యంతో పాటు గత కొనే్నళ్ల నుంచి తుదిమెరుగులు దిద్దుకుంటూ వస్తున్నందున కాచిగూడ రైల్వే స్టేషన్ అద్భుతంగా తయారైంది. ఈ స్టేషన్‌లో ఉన్న సదుపాయాలు గురించి తెలుసుకుంటే యాప్ ఆధారిత క్యాబ్ సౌకర్యం కోసం ఓలా క్యాబ్స్‌కి కాంట్రాక్ట్ ఇవ్వడంతో నిత్యం అందుబాటులో క్యాబ్‌లు ఉండడం, నవరస్ అనే యాప్ ద్వారా ఫ్లాట్‌ఫాం పైనే వివిధ సౌకర్యాల గురించిన నావిగేషన్ అవగాహన, రైల్వే స్టేషన్ ఇన్‌ఫో యాప్ ద్వారా కాచిగూడ స్టేషన్‌లో అందుబాటులో ఉన్న ప్రయాణికుల సౌకర్యాలన్నీ తెసుకునే అవకాశం, అన్ని ఫ్లాట్‌ఫాంలపై లిప్టులు, ఎస్కలేటర్లు, డిజిటల్ రూపంలో రైళ్ల సమాచారం తెలుసుకునే తాకే తెర ఉన్న యంత్రాల ఏర్పాటు, ముందే చెల్లించి ప్రయాణించే ఆటో బూత్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. చెత్త నివారణ, ఆహార పదార్ధాల వ్యర్థాలను కంపోస్టు ఎరువుగా మార్చే ఏర్పాటు, రేక్‌ల నిర్వహణకు ప్రత్యేక పిట్‌లైన్ ఏర్పాటు, స్వచ్ఛ భారత్ సంకల్పం సిద్ధించే విధంగా ప్రచార ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఇంతే కాకుండా ఈ స్టేషన్‌లో భారతీయ రైల్వే మొత్తం మీద అత్యధిక ఇంధన సామర్థ్ధ్యాన్ని కలిగిన ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 400 కిలోవాట్ల శక్తి గల విద్యుత్‌ను ఇచ్చే సౌర ఫలకాలను ఫ్లాట్‌ఫాంల పై కప్పులపై అమర్చడం ద్వారా యేటా రూ.21.66 లక్షలను ఆదా చేయడం జరుగుతోంది. మిగిలిన రైల్వేస్టేషన్ల మీద ఒత్తిడి తగ్గించేందుకు కాచిగూడ స్టేషన్ నుంచి క్రమేణా ఎక్కువ రైళ్లను నడిపేందుకు ప్రణాళికతో ఉన్నారు. స్పెషల్ రైళ్లు కొన్ని ఇక్కడి నుంచే బెంగళూరు, తిరుపతి, ఇతర ప్రాంతాలకు ఈ స్టేషన్ నుంచి ప్రారంభించి నడుపుతారు. ప్రస్తుతం 81 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మొత్తం 140 రైళ్ల సర్వీసులను కాచిగూడ స్టేషన్ నిర్వహిస్తోంది. టాటానగర్, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, కృష్ణరాజపురం, బెంగళూరు, ఖాన్‌పూర్ స్టేషన్లకు కాచిగూడ నుంచి నిత్యం రైళ్లు నడుస్తుంటాయి. అన్నింటికీ మించి ఈ స్టేషన్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డు దక్కించుకుంది.