తెలంగాణ

పదోన్నతుల్లో రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందు కోసం రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చే పార్లమెంట్ సమావేవాల్లో ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్‌లో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముక్య అతిధిగా కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు. రాజకీయ, ఉద్యోగ రంగాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇటీవల నిర్వహించిన సర్వేల ద్వారా వెల్లడి అవుతున్నాయని అన్నారు. దేశ జనాబాలో 56శాతానికి పైగా ఉన్న బీసీలు రాజకీయ రంగంలో 14శాతం ప్రాతినిధ్యం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం అవుతుందని అన్నారు. ఇక ఉద్యోగ రంగంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 9శాతం మాత్రమే బీసీలు ఉన్నారని అన్నారు. దేశవ్యాప్తంగా 54లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా కేవలం 4లక్షల 62వేల మందే బీసీలు ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు ఉద్యోగ, రాజకీయ రంగాల్లో న్యాయం చేసేందుకు బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల సాదనకై పార్లమెంట్ ముందు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.