తెలంగాణ

కొత్త జిల్లాలపై అఖిలపక్ష భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 21: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై సీఎం కెసిఆర్ ఏక పక్షంగా వ్యవహరించకుండా తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ శాసన సభ పక్ష నేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం నల్లగొండలో ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ వ్యవహారశైలి అప్రజాస్వామికంగా ఉందంటు తప్పుబట్టారు. ఇప్పటికే ప్రచార సాధనాల ద్వారా వెల్లడవుతున్న కొత్త జిల్లాల ప్రతిపాదనల పట్ల విడిపోతున్న, విలీనమవుతున్న ప్రాంతాల ప్రజల నుండి, పార్టీల నుండి ఆందోళనలు రేకెత్తాయన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు కొత్తగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటు పార్లమెంటు ముందుంచాల్సివుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందుగా జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డిజన్లు ఏర్పాటు చేయడం మనుముందు సమస్యలకు దారితీస్తుందన్నారు. సిఎం కెసిఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గాల పునర్విభజనను అనుసరించి జిల్లాల ఏర్పాటు జరిగేలా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవడంపై ఆలోచన చేయాలన్నారు. గతంలో మండల వ్యవస్థ ఏర్పాటు సందర్భంగా తన సారథ్యంలో రెండు మూడేళ్ల పాటు శాసనసభ లోపల, బయట విస్తృత చర్చలు, సంప్రదింపులు చేసి మండలాలను ఏర్పాటు చేశామంటూ ఆయన గుర్తు చేశారు. గతంలో పరిపాలన సౌలభ్యం పేరుతో రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్విభజన చేయడం దేశంలో ఇదే తొలిసారని ఆయన అన్నారు.

విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు