తెలంగాణ

ఎమ్మెల్సీ పదవికి తుమ్మల రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తుమ్మల రాజీనామాను ఆమోదించారు. రెండు చట్టసభలకు ఎన్నికైతే రెండు వారాల్లోగా ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు తుమ్మల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన లోగడ ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. తుమ్మల రాజీనామాతో కౌన్సిల్‌లో ఒక సీటు ఖాళీ అయింది. ఇలాఉండగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తుమ్మల ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.