తెలంగాణ

బీసీ డిక్లరేషన్ అమలు చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో డిసెంబర్ 3న జరిగిన అఖిల పక్షాల ప్రజాప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు పరిచేలా చూడాలని స్పీకర్ మధుసూదన చారిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కోరింది. సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆదివారం సభాపతిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గత 25 సంవత్సరాల క్రితం నిర్ణయించిన 34 శాతం రిజర్వేషన్లను సవరించి 54శాతానికి పెంచాలని, పదోన్నతుల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం, బీసీ కార్పొరేషన్, వివిధ కులాల ఫెడరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు అందించాలని పేర్కొన్నారు. స్పందించిన స్పీక ర్ ప్రభుత్వానికి పంపుతామని హామీ ఇచ్చారు.