తెలంగాణ

టిడిపితోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 23: తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యమంపై మమకారంతో ప్రజలు తెరాసకు అధికారాన్ని కట్టబెడితే, కుటుంబపాలనతో ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని వల్లకాడులా మార్చుతున్నాడని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ జిల్లా మినీమహానాడు సోమవారం కరీంనగర్‌లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రేవంత్ ముఖ్యఅతిధిగా మాట్లాడుతూ, సిఎం తీరుపై దుమ్మెత్తిపోశారు. ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో టిఆర్‌ఎస్‌కు పట్టంకడితే, ప్రజల ఆశయాలను వమ్ముచేస్తూ, తెలంగాణ ద్రోహిగా మారారని ఆవేశపూరిత ప్రసంగం చేశారు. తన పార్టీ గుర్తుతో గెల్చినవారిపై నమ్మకంలేక ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను నయానో భయానో ఒప్పించి కండువాలు కప్పడమే ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికొదిలి బడుగు, బలహీన వర్గాల నోట్లో మట్టికొడుతున్న వైనాన్ని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో పలుమార్లు ప్రశ్నిస్తే, జీర్ణించుకోలేని కెసిఆర్ ఆంధ్రా పార్టీ పేర టిడిపిని తెలంగాణ ప్రజల నుంచి వేరుచేసే కుట్రకు తెరలేపారని, కోట్ల రూపాయలు, కాంట్రాక్టు పనులు, పదవులు ఆశజూపి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ఇక ఇక్కడ టిడిపికి చెల్లు అంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో తెలుగుదేశాన్ని అంతమొందించే శక్తి ఏ రాజకీయపార్టీకి లేదని ఆయన తేల్చిచెప్పారు. పదవుల కోసం టిఆర్‌ఎస్‌లో చేరుతున్న వారికి అథోగతే పడుతుందన్నారు. ఇందుకు నిదర్శనమే ఎర్రబెల్లి దయాకర్‌రావును ఉదహరించారు. తన 14 ఏళ్ళ ఉద్యమ పోరాటంలో పాలనచాతుర్యులుగా ఏ ఒక్కనాయకుడిని తీర్చిదిద్దలేని దద్దమ్మగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అభివర్ణించారు. ఆ పార్టీలో మంత్రి పదవులు అనుభవిస్తున్నవారంతా తమపార్టీకి చెందిన వలసపక్షులేనన్నారు. రెండేళ్ళ పాలనలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, రూ.3.80 లక్షల కోట్ల అప్పులు మాత్రం వారినెత్తిన రుద్దిందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజలను జాగృతం చేస్తే, 2019లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకే పాలనాపగ్గాలు దక్కుతాయని ఆయద ఆకాంక్షించారు. సుమారు 6 గంటలపాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్‌రెడ్డి, నాయకులు వొంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.

చిత్రం మినీ మహానాడులో ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి