తెలంగాణ

దానం ఫిరాయింపుతో కాంగ్రెస్ బలపడింది : అంజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్‌ను వీడడంతో పార్టీకి ఎలాంటి నష్టం లేదని, పైగా పార్టీ మరింత బలపడిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ దానం నాగేందర్ అన్నారు. తనకు పదవి ఇప్పించానని దానం నాగేందర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తన ముందు దానం ఓ బచ్చా అని వ్యాఖ్యానించారు. తాను హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తో దానంకు భయం పట్టుకుందన్నారు. గతంలో దా నం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరి, తిరిగి కాంగ్రెస్‌లో చేరారని గుర్తుచేశారు. ఇప్పుడు రెండో సారి కాంగ్రెస్‌ను వీడిన దానంకు సిగ్గు ఉండాలని అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు.
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం..
సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం జరగనున్నది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియాతో పాటు, ఇటీవల ఏఐసీసీ కార్యదర్శులుగా నియమితులైన కేరళకు చెందిన శ్రీనివాసన్ కృష్ణన్, కర్నాటకకు చెందిన సలీం అహ్మద్, డీఎస్ బోసు రాజు హాజరు కానున్నారు.