తెలంగాణ

26న కాళేశ్వరానికి పారిశ్రామికవేత్తల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి తెలంగాణ పారిశ్రామిక వేత్తల బృందం ఈనెల 26న వెళ్లనుంది. టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సారధ్యంలో 20 పారిశ్రామిక వాడలకు చెందిన 200 మంది పారిశ్రామిక వేత్తలు ప్రాజెక్టు సందర్శించేందుకు వెళుతున్నారు. ఇందుకోసం తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు కే.సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క రోజు అధ్యయన యాత్రలో భాగంగా మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ టనె్నల్, పంపు హౌస్, రిజర్వాయర్ నిర్మాణ పనులను బృందం పరిశీలించనుంది. అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యాలతో నిర్మాణం జరుపుకుంటున్న కాళేశ్వరం ప్రపంచం దృష్టిని ఆకర్శిస్తోందని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇంజనీరింగ్ నిపుణులు ప్రాజెక్టు నిర్మాణ పనులు చూసి ఎంతో అద్భుతమని కొనియాడుతున్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను పాడి పండటలతో కూడిన ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షలకు అనుగుణంగా కాళేశ్వరం పనులు సాగుతున్నాయని తెలిపారు.