తెలంగాణ

సౌర విద్యుత్‌తో ట్రాన్స్‌మిషన్ నష్టాలు తగ్గించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గించి సౌర విద్యుత్‌ను వాడుతున్నందున విద్యుత్ నష్టాలు తగ్గాయని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జనరల్ మేనేజర్ సంధ్యారాణి చెప్పారు. ఉత్తర డిస్కంలో తీసుకువస్తున్న వినూత్న విధానాలు అందుకు నిదర్శనమని ఆమె అన్నారు. సౌర విద్యుత్ వాడకంలో తీసుకువచ్చిన సంస్కరణలతో తనకు అవార్డు రావడం జరిగిందన్నారు. 2017-18 సంవత్సరంలో 669 మెగావాట్ల సౌర విద్యుత్‌ను సాధించామని, దీంతో తాము 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయడానికి వీలుకల్గిందన్నారు. ట్రాన్స్‌మిషన్‌పై భారం పడకుండా 33 కేవీ వద్ద సౌర విద్యుత్‌ను ప్రవేశపెట్టి గ్రిడ్ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. దీంతో 122 మెగావాట్ల విద్యుత్‌ను ఆదాచేయడం జరిగిందాన్నారు. వీటి కారణంగా రూ. 49 కోట్ల రూపాయలు యేడాదికి ఆదా అయ్యిందన్నారు. తాము చెల్లించాల్సిన రూ. 533 కోట్ల అదనపు వ్యయాన్ని తగ్గించామాన్నారు. ఢిల్లీలో జరిగిన స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డును తనకు దక్కడం పట్ల ఆనందంగా ఉందని, దీనికి కారణం తమ సంస్థలోని ఉద్యోగుల కృషితో స్కాచ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సీనియర్ డిస్టింన్‌గ్విష్‌డ్ ఫెల్లో నిర్మల్ బన్సల్ చేతుల మీదుగా అవార్డు లభించడం జరిగిందని సంధ్యారాణి తెలిపారు. కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి అన్నమనేని గోపాల్‌రావు మాట్లాడుతూ సంధ్యారాణి పట్టుదల ఉన్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడం పట్ల ఆయన అభినందించారు. సంస్థ పౌర సంబంధాల అధికారి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.