తెలంగాణ

మట్టి నుంచి ఇసుక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: పర్యవరణాన్ని రక్షించడానికి సింగరేణి సంస్థ ఇక నదుల ఇసుకను వాడకుండా పూర్తిగా వైదొలగుతోంది. వాటికి ప్రత్యామ్నాయంగా ఆధునిక యంత్రాలతో మట్టినుంచి ఇసుకను బయటకు తీసుకురావడానకి సింగరేణి సంస్థ యాజమాన్యం సన్నాహాలు చేపట్టింది. సింగరేణికి చేదోడువాదోడుగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ తీసుకుంటున్న చర్యలతో దేశ వ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలు సింగరేణి వైపు సూస్తున్నాయి. సింగరేణిలో చేపట్టిన ఒవర్ బర్డెన్ (మట్టి) నుంచి ఇసుక తయారు చేసే విధానాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోవడానికి ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. భూగర్భ గనుల్లో బొగ్గు తవ్వకం తర్వాత ఏర్పడే ఖాళీ ప్రాంతాలను పూడ్చడానికి నదుల ఇసుకు వాడుతున్న విషయాలను మనం చూస్తున్నాం. ఈ విధానాన్ని శాండ్ స్టోయింగ్ అంటారు. కొత్త విధానంతో ప్రతియేటా సుమారు 20 నుంచి 22 లక్షల టన్నుల ఇసుకను సింగరేణి తన ఏరియాలకు అవసరమైన ఇసుకను గోదావరి నుంచి ప్రభుత్వ అనుమతితో తరలిస్తున్నాం. దేశ వ్యాప్తంగా పర్వారణ రక్షించేందుకు తాము సిద్ధమని పలు కంపెనీలు చెబుతున్నప్పటికీ ఆచరణలో ముందడుగు వేయడంలేదని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఓపెన్‌కాస్టు గనుల్లో బొగ్గు పొరలపై ఉన్న మట్టిని లక్షల టన్నుల్లో తవ్వి బయటకు పోస్తుంటారు. ఈ మట్టిలో ఇసుక ఎక్కువ శాతం ఉంటుందని సింగరేణి సంస్థ చెబుతోంది. ఓవర్ బర్డెన్‌ను యంత్రాల ద్వారా ప్రాసెస్ చేసి ఇసుకను బయటుకు తీస్తారు. ఈ విధానంతో గనుల్లో ఖాళీ ప్రాంతలను నింపడానికి ఓవర్‌బర్డెన్ ఎంతో ఉపయోగకరంగావుంది. దీంతో నదుల్లో నుంచి ఇసుక రవాణాను తగ్గించేందుకు అవకాశం ఉంది. మట్టి నుంచి ఇసుకను తీసిన తర్వాత జెఎన్‌టియులో వివిధ పరీక్షలు నిర్వసించారు. ఈ ఇసుకను నిర్మాణ రంగంలో వాడవచ్చునని తేలింది. ఈ నేపథ్యంలో సింగరేణిలో సివిల్ పనులకు కావాల్సిన ఇసుకను ఓ,బి నుంచి తీసుకోవాలని, దీని కోసం దేశ వ్యాప్తంగా టెండర్లుకు సింగరేణి ఆహ్వానించింది. ఆధునిక యంత్రాలతో ఓబి నుంచి ఇసుకను మొదలేట్టిన తర్వాత నదుల ఇసుకను పూర్తిగా నిలిపివేయనున్నారు. ప్రస్తుతం నదుల ఇసుకపై ఆధారపడే నిర్మాణ దారులు ఇక ఓ.బి ఇసుకకు ప్రయత్నాలు చేపట్టవచ్చునని సింగరేణి సంస్థ యోచిస్తోంది. రాబోవు రోజుల్లో సింగరేణి బొగ్గుదో పాటు ఓ.బి ఇసుకకు గిరాకి పెరుగుతుందని సింగరేణి సంస్థ ఎదురుచూస్తోంది. తాము చేస్తున్న ప్రయత్నాలకు వివిధ రంగాల నుంచి ప్రశంశలు వస్తున్నాయని సింగరేణి సంస్థ సిఎండి శ్రీ్ధర్ ఆశాధావం వ్యక్తం చేస్తున్నారు. తొలుత సింగరేణిలో చేపట్టిన వివిధ నిర్మాణ రంగాలకు ఓ.బి ఇసుకను ఉపయోగించి, తర్వాత వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తమన్నారు. అంతార్జతీయ స్థాయిలో సింగరేణి సంస్థ తీసుకువస్తున్న నూతన విధానాలను ఆయా దేశాలు అమలు చేయడం గర్వంగా ఉందని సంస్థ సిఎండి శ్రీ్ధర్ తెలిపారు.