తెలంగాణ

12శాతం రిజర్వేషన్లకు కెసిఆర్ కట్టుబడి ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కట్టుబడి ఉన్నారని మహబూబాబాద్ ఎంపి సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో వారు మాట్లాడుతూ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టడమే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అనేక సభల్లో ఉద్యమ నాయకునిగా కెసిఆర్ హామీ ఇచ్చారని వారు తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల నాటికి తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా మారబోతున్నాయని వారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని అనేక హామీలనూ అమలు నెరవేరస్తున్న తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై అనుమాన పడాల్సిన అవసరం లేదని వారన్నారు.
వెటర్నరీ వర్శిటీకి పీవీ పేరు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24 : తెలంగాణకు చెందిన వెటర్నరీ యూనివర్శిటీ పేరును ‘పివి నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ’గా మార్చారు. అంతకుముందు ఈ వర్శిటీకి ‘పివి నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర వెటర్నరీ, ఎనిమల్, ఫిషరీ సైనె్సస్ యూనివర్సిటీ’ అనే పేరు పెట్టారు. ఈ పేరు చాలా పెద్దగా ఉండటంతో క్లుప్తంగా ఉండాలన్న ఉద్దేశంతో పేరులో స్వల్పమైన మార్పు చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. (జీఓ ఎంఎస్ నెంబర్ 10, తేదీ 24-05-2016) జారీ అయింది. సంబంధిత రిజిస్ట్రార్ అవసరమైన చర్యలు తీసుకోవాలని పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా ఆదేశాలు జారీ చేశారు.
పనులను వెంటనే పూర్తి చేయండి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24 : తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ నేతృత్వంలో చేపట్టిన పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖ పనులను మంగళవారం ఆయన ఇక్కడ సమీక్షించారు. మండలాల నుండి జిల్లా కేంద్రాలకు డబల్ లేన్ రోడ్లను పూర్తి చేయాలని సూచించారు. ప్రణాళికా పద్దుల కింద చేపట్టిన 358 వంతెనల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు.
సుంకం చెల్లించాల్సిందే
క్యాప్టివ్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లకు హైకోర్టు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని క్యాప్టివ్ విద్యుత్ సంస్థల యజమానులు ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్‌కు 25పైసల చొప్పున సుంకాన్ని చెల్లించాలని, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం చట్టం 1939 చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. తాము సుంకం చెల్లించాలని విద్యుత్ సంస్థలు కోరడాన్ని సవాలు చేస్తూ క్యాప్టివ్ విద్యుత్ సంస్థల యజమానులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. రాష్ట్ర ఆర్థిక ఆదాయానికి సంబంధించిన చట్టమని, దీనిపై కోర్టులు జోక్యం చేసుకోలేవని కోర్టు తెలిపింది.

వేతనాల పెంపుకోసం
31న ఎఎన్‌ఎంల ధర్నా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్న నాలుగు వేల మంది కాంట్రాక్టు రెండవ ఎఎన్‌ఎంల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, పదవ పిఆర్‌సి ప్రకారం ఎఎన్‌ఎంలకు కనీస బేసిక్ రూ. 21,300లతోపాటు డిఎ, హెచ్‌ఆర్‌ఎకూడా వర్తింపజేయాలని కోరుతూ ఈ నెల 31న హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె యాదానాయక్, భూపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండవ ఎఎన్‌ఎంలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాల కోసం జివో నెం. 14న జారీ చేసిందని, సదరు జివోలోని ఇతర కేటగిరిలలో పనిచేస్తున్న వారికి వేతనంపై అదనంగా 50శాతం పెంచాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయని వీరికి మాత్రం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం గైడ్‌లెన్స్ ప్రకారం 5శాతం పెంచి చేతులు దులుపుకున్నారని వారు నిశితంగా విమర్శించారు. పర్మినెంట్ ఎంప్లారుూస్ మొత్తం బేసిక్ ఇవ్వడానికి తగు పరిశీలన చేసి న్యాయం చేయాలని వారు కోరారు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు శానిటేషన్ ఉద్యోగులకు ప్రభుత్వ జివోల ప్రకారం వేతనాలు చెల్లించడంలేదని ఎఐటియుసి రాష్ట్ర నాయకులు ఎండి యూసుఫ్, పద్మావతి, పనస ప్రసాద్ రావు డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎటిఎంల చోరీ కేసు
సిసిఎస్‌కు అప్పగింత
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: హైదరాబాద్‌లోని ఏటిఎం చోరీ సొత్తును క్రికెట్ బెట్టింగ్‌కు వినియోగించినట్టు సమాచారం అందిన పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల నుంచి కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. రెండ్రోజుల క్రితం ఏటిఎంలకు డబ్బులు సరఫరా చేసే ఫైనాన్స్ సెక్యూరిటీ సంస్థలో రూ. 9.98 కోట్లు అపహరించబడ్డాయని సంస్థ అధికారి తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. నలభై రోజులు..రూ. 4.5 కోట్లు క్రికెట్ బెట్టింగ్..ఇదంతా ఖాతాదారుల సొమ్ము.. అప్పనంగా నొక్కేసిన డబ్బంతా ఐపిఎల్ మ్యాచ్‌లకు, అమ్మాయిలతో జల్సాలకు ఖర్చు చేసినట్టు పోలీసులు ఒక్కో కూపీ లాగుతుంటే ఏటిఎం కుంభకోణం డొంకంతా కదులుతోంది. ఏటిఎంల్లో జమ చేయాల్సిన సొమ్మును సంస్థ సభ్యులే కాజేయడం కలకలం రేపుతోంది. నగరంలోని 52 ఏటిఎం కేంద్రాల్లో జమ చేయాల్సిన సొమ్ము గల్లంతైనట్టు ఆడిటింగ్‌లో బయటపడింది. క్యాష్ కస్డోడియన్లుగా పనిచేస్తున్న అనంతపురానికి చెందిన లోకేశ్వర్ రెడ్డి, ప్రవీణ్ కాజేసినట్టు సంస్థ మేనేజర్ నాగరాజు తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎఫ్‌ఎస్‌ఎస్ సంస్థ, ఆర్‌సిఐ సంస్థకు ఇచ్చిన ఒప్పందాన్ని రద్దు చేస్తూ మాయమైన డబ్బుపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ కేసును తుకారం గేట్ పోలీసులు సిసిఎస్ పోలీసులకు అప్పగించారు. దీంతో కూపీ లాగుతున్న సిసిఎస్ పోలీసులు ఓ నిందితుని వద్ద నుంచి రూ. కోటి స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పరారీలోఉన్న లోకేశ్, ప్రవీణ్‌లు దొరికితే కానీ అసలు డబ్బుల విషయం బయటకు వస్తుందని సిసిఎస్ అధికారి ఒకరు తెలిపారు.