తెలంగాణ

జూరాల వద్ద ప్రమాద ఘంటికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, డిసెంబర్ 23: రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మితమైన మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు జిల్లాకే తలమానికంగా పేరొందింది. అలాంటి జూరాల ప్రాజెక్టు వద్ద ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇట్టే అర్థవౌతుంది. ముఖ్యంగా జూరాల కుడి, ఎడమ కాలువల నుంచి సుమారు లక్షపైచిలుకు ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, జడ్చర్ల, ఆత్మకూర్‌తో పాటు ఇతర గ్రామాలకు తాగునీటిని అందించే కల్పతరువుగా జూరాలకు పేరుంది. ఇలాంటి జూరాలలో సక్రమంగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఒండ్రుమట్టి చేరడం, పూడికతీత చేయకపోవడం, అక్రమ ఆయకట్టును నియంత్రించకపోవడం వంటి సమస్యల కారణంగా ఆశించిన మేర ఆయకట్టుకు నీరందించలేని పరిస్థితుల్లో ప్రాజెక్టు తయారైంది. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మితమైన భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులకు సైతం అనధికారికంగా, రాజకీయ నాయకుల అత్యుత్సాహానికి అధికారులు దాసోహమై నీటిని వృథా చేయడంతో జూరాల ప్రాజెక్టులో ఇలాంటి పరిస్థితులు దాపురించాయని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో ఆరుతడి పంటలు వేసుకోవాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించినప్పటికీ రైతులు వరి పంటలవైపు వెళ్లడం కూడ కొంత ఇబ్బందికర పరిస్థితులకు కారణమని తెలుస్తోంది. జూరాల ప్రాజెక్టు కింద ఉన్న పొలాలు ఆరుతడి పంటలకు అనువైనవి కాకపోవడంతో వరి పంటలు వేసుకోవాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. ఏది ఏమైనా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు నడిగడ్డ ప్రాంతంతోపాటు జిల్లా మొత్తాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. జూరాల ప్రాజెక్టు ఎగువ భాగంలో ఉన్న కర్ణాటక ప్రాంతంతో పాటు నది పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలు మినహా ప్రస్తుతం జూరాల్లో ఉన్న 7.8 టిఎంసిల నీటి నిల్వలు జిల్లా దాహార్తిని తీర్చలేవని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అదేవిధంగా సుమారు 30 వేల ఎకరాల్లో వరిపంట కోతదశలో ఉండడంతో 15 రోజుల వరకు సాగునీటిని అందించాలని గద్వాల, మక్తల్ ఎమ్మెల్యేలు డికె అరుణ, చిట్టెం రాంమోహన్‌రెడ్డి అధికారులపై రైతుల పక్షాన ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాగునీటికే ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో సాగునీటి పరిస్థితి ఏమిటని అధికారులు తలపట్టుకుంటున్నారు. ఈ ఏడాది కూడా కర్ణాటక కరుణ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో కురిసే వర్షాలపైనే ఎక్కువగా ఆధారపడడంతో పాటు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు అంటున్నారు. గత వారం రోజులుగా జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని నిలిపివేయడంతో రైతుల ఆందోళనలు తీవ్రవౌతున్నాయి. వరి పంటలకు నీరు అందక పోవడంతో రైతులు కాలువల గట్ల వెంట రాళ్లను అడ్డంగా పెట్టి నీటిని పారించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో
కాంగ్రెస్ గెలుపు తథ్యం
ఎంపి గుత్తా, మాజీ ఎంపిలు పొన్నం, వివేక్ ధీమా
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, డిసెంబర్ 23: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం తధ్యమని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎంపిలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, అంజన్‌కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్‌లు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండలో ఎంపి గుత్తా నివాసంలో రాజగోపాల్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టిఆర్‌ఎస్ తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ సాధన కోసం గత పార్లమెంటులో ఎంపిలుగా తమతో పాటు రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీని ఎదిరించి పోరాడటం జరిగిందన్నారు. సోనియాగాంధీని, స్పీకర్ మీరాకుమార్‌ను ఒప్పించి తెలంగాణ బిల్లు ఆమోదం కోసం రాజగోపాల్‌రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా రాష్ట్ర సాధన కోసం పోరాడిన రాజగోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపిటీసిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లు గెలిపించాల్సి వుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సిఎం కెసిఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకే ప్రమాదకరంగా తయారైందన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కెసిఆర్ వైఖరి ప్రజాస్వామ్యానికి నష్టదాయకమన్నారు. విశ్వశాంతి, లోక కల్యాణం కోసమంటూ కెసిఆర్ ఆయిత చండీయాగం చేస్తున్నారని అయితే ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యంలో అవి ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు. చండీయాగం వారికి సద్బుద్ధిని ప్రసాదించాలని తాము కోరుతున్నామన్నారు. టిడిపి నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన చిన్నపరెడ్డి ఏనాడు తెలంగాణ కోసం పోరాడ లేదని అటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించకుండా తెలంగాణ కోసం పోరాడిన రాజగోపాల్‌రెడ్డిని స్థానిక ఓటర్లు గెలిపించాలని వారు కోరారు. నల్లగొండ జిల్లాలో 1110మంది స్థానిక ఓటర్లలో టిఆర్‌ఎస్‌కు కేవలం 138మంది సభ్యులున్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తు కాంగ్రెస్ స్థానిక ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తూ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా గెలవాలని ప్రయత్నించడం ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. టిఆర్‌ఎస్ తమకు మెజార్టీ ఉందంటూ ఆడుతున్న మైండ్‌గేమ్ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించలేదన్నారు. జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డి సాగిస్తున్న పార్టీ ఫిరాయింపులకు సిఎం కెసిఆర్ అడ్టుకట్ట వేసి రాజ్యంగ విలువలను కాపాడాల్సిన అవసరముందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక ఓటర్లు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం జిల్లా కాంగ్రెస్ నాయకత్వం అంతా సమష్టిగా శ్రమిస్తుందన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి జగదీష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటర్లను తీవ్రమైన బెదిరింపులకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. ఐన్పప్పటికీ తెలంగాణ సాధనకు పోరాడిన తన విజయం తధ్యమని కాంగ్రెస్ నుండి గెలిచిన మెజార్టీ స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఇతర పార్టీల ఓటర్లు నిత్యం వారికి అందుబాటులో ఉండే తనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం రాంరెడ్డి, నాయకులు కొండేటి మల్లయ్య, పుల్లెంల వెంకటనారాయణగౌడ్, పున్నా కైలాష్ తదితరులు పాల్గొన్నారు.