తెలంగాణ

వైద్య ఆరోగ్య శాఖలో 209 ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఎంఎన్‌జె ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజనల్ కేన్సర్ సెంటర్లలో ఉన్న 209 ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 95 జారీ చేసింది. పోస్టుల భర్తీ బాధ్యతను సర్వీసు కమిషన్‌కు అప్పగించారు. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో 8 ల్యాబ్ టెక్నీషియన్లు, 1 ఏఓ పోస్టు, 6 మెడికల్ ఫిజిసిస్టులు, 1 బయో మెడికల్ ఇంజనీర్, 4 జూనియర్ అసిస్టెంట్లు, రేడియోగ్రాఫర్ ఉద్యోగాలు 10, రెండు ఫార్మాసిస్టు పోస్టులు భర్తీ చేస్తారు. 6 సోషల్ వర్కర్ పోస్టులు, ఒకటి అసిస్టెంట్ లైబ్రరియన్, రెండు బ్లడ్ బ్యాంకు సూపర్‌వైజర్ పోస్టులు, 10 ల్యాబ్ అటెండెంట్ పోస్టులు, 16 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు, రెండు వౌల్డ్ టెక్నీషియన్ పోస్టులు, రెండు ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు, ఒకటి హెల్త్ సబ్ ఇనస్పెక్టర్, మూడు మెడికల్ రికార్డుల టెక్నీషియన్ పోస్టులు, 10 థియేటర్ అటెండెంట్‌లు, 85 స్ట్ఫా నర్సులు, ఒక లెక్చరర్ పోస్టు, ఒకటి జూనియర్ అసిస్టెంట్ మెడికల్ ఆంకాలజీ, జూనియర్ అసిస్టెంట్ పెయిన్ కేర్ పోస్టు, 4 ప్రొఫెసర్ పోస్టులు, 3 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తారు. 4 సీనియర్ రెసిడెంట్ గైనకాలజీ పోస్టులు, రెండు సీనియర్ రెసిడెంట్ పాథాలజీ, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ పోస్టులు రెండు, మోలిక్యూలర్ ఆంకాలజీ ఒకటి భర్తీ చేస్తారు.
వర్శిటీల బంద్‌కు మద్దతు
కొత్తగా దేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటును వ్యతిరేకిస్తూ మంగళవారం నాడు నిర్వహిస్తున్న బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ అనాలసిస్ కన్వీనర్ ఎన్ నారాయణ తెలిపారు.
హోలీమేరీకి అవార్డు
ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్‌లేలాండ్ జాతీయ స్థాయిలో నిర్వహించిన వెహికిల్ ఫెమిలరైజేషన్ అండ్ ఓవర్‌హాలింగ్ కార్యక్రమంలో ప్రతిభాపాటవాలు చూపినందుకు హోలీ మేరీ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్ధులకు బెస్టు పెరఫార్మెన్స్ అవార్డును అందజేసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 28 కాలేజీల నుండి విద్యార్ధులు ఇందులో పాల్గొనగా, అవార్డును హోలీ మేరీ విద్యార్థులు పొందారు.