తెలంగాణ

విద్యాసంస్థలకు అకడమిక్ క్యాలెండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యాసంస్థల్లో ఈ ఏడాది నుండి అకడమిక్ క్యాలండర్‌ను పక్కా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల జాబితాలను ఎప్పటికపుడు పోర్టల్‌లో ఉంచాలని, అన్ని సంస్థల్లో అడ్మిషన్లను ఈ నెల 15లోగా పూర్తి చేసి వెంటనే తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. విద్యావలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని, అదే విధంగా 20వ తేదీలోగా వారి నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల జాబితా అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచాలని చెప్పారు. డిస్ట్రబ్ అయిన కాంట్రాక్టు జూనియర్, డిగ్రీ లెక్చరర్ల నియామకాలు పూర్తి చేయాలని, నాలుగో విడత దోస్త్ కౌనె్సలింగ్ నిర్వహించి విద్యార్థులు అందరికీ కాలేజీల్లో చేరే అవకాశం కల్పించాలని అన్నారు. విద్యాశాఖ క్యాలండర్‌ను అన్ని విద్యాసంస్థల్లో ఖచ్ఛితంగా అమలు చేయాలని కడియం శ్రీహరి చెప్పారు. వీలైనంత త్వరలో జిల్లా కలెక్టర్లు, డీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యావలంటీర్ల నియామకం, విద్యార్ధులకు యూనిఫారాలు, టెక్ట్స్ బుక్స్ పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జూనియర్ , డిగ్రీ కాలేజీల్లో సాధారణ బదిలీలతో డిస్ట్రబ్ అయిన కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే తిరిగి నియమించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇందుకోసం కౌనె్సలింగ్ నిర్వహించాలని అన్నారు. జూనియర్ , డిగ్రీ కాలేజీల్లో గుర్తింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. పోటీ పరీక్షలు రాసి వివిధ కోర్సుల్లో చేరే విద్యార్ధుల ప్రవేశాల ప్రక్రియను కూడా 15వ తేదీలోగా పూర్తి చేయాలని అన్నారు. లా అడ్మిషన్లను కూడా వెంటనే చేపట్టాలని సూచించారు. ఈసారి విద్యాసంస్థల్లో హరితహారం విజయవంతం చేయాలని, ఇందుకోసం ప్రతి పాఠశాల, కాలేజీ, యూనివర్శిటీ వారీ వివరాలు సేకరించి పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేయాలని అన్నారు. విద్యాసంస్థల్లో హరిత విద్యా సంస్థలుగా పచ్చదనంతో కళకళలాడాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య సంచాలకుడు విజయకుమార్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ లింబాద్రి, ఆర్‌జేడీ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి కడియం శ్రీహరి