తెలంగాణ

కౌలు రైతులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూలై 9: ప్రభుత్వాలు కౌలు రైతులను కూడా రైతులుగా గుర్తించాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని దమ్మ విషశస్య ధ్యాన కేంద్రాన్ని సందర్శించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు ఎక్కువ శాతం కౌలు రైతులే ఉన్నారన్నారు. అందుకే కౌలు రైతులను రైతులుగా గుర్తించి ఆదుకున్నప్పుడే ప్రభుత్వాలు అమలుచేస్తున్న రైతు సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్నారు. సాగర్ ప్రాజెక్టు అద్భుతమైనదని, ఎందరో మహానుభావులు నడిచిన ప్రదేశమన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల పరిపాలన విషయంలో పోటీతత్వం పెరిగిందని దీంతో మంచి అభివృద్ధి కనిపిస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడ్తున్న ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని, సమస్యగా మారిందన్నారు. ఐదు సంవత్సరాల పరిపాలన చేసిన పాలకులు తమకు ఓటు వేయమని ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. తానే రాజకీయ పార్టీలో చేరలేదని, ఏపీలో ఇప్పటివరకు ఆరు జిల్లాలు పర్యటించానని, మంగళవారం నుండి కర్నూలు జిల్లా పర్యటన ప్రారంభమవుతుందన్నారు. పూర్తి స్థాయి పర్యటన పూర్తయిన అనంతరం అవగాహన వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నపుడే రైతులకు లభ్ధి చేకూరుతుందన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర వచ్చే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పటికీ రైతుల భూములు పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ కాకపోవడం సమస్యగా మారిందన్నారు. వారితో పాటు మాచర్ల సీఐ సాంబశివరావు, ఏస్‌ఐ శీనయ్య, సురేష్‌లున్నారు.

చిత్రం..సాగర్ డ్యాంను వీక్షిస్తున్న లక్ష్మీనారాయణ