తెలంగాణ

పసికందు అపహరణ.. తల్లి ఒడికి చేర్చిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 10: ఆదిలాబాద్ రిమ్స్ ప్రసూతి వార్డులో తల్లి ఒడిలో నిద్రిస్తున్న ఆరు రోజుల పసికందు అపహరణకు గురైన రెండు గంటల వ్యవధిలోనే నిందితులు పోలీసులకు పట్టుబడ్డ సంఘటన అలజడి రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చోర్‌గాం గ్రామానికి మమత తొలికాన్పు కోసం ఈనెల 2న రిమ్స్ ఆసుపత్రిలో చేరగా 4వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు సరిగ్గా ఊపిరి ఆడడం లేదని డాక్టర్లు వైద్య పరీక్షల కోసం చిన్న పిల్లల వార్డులోని ఐసియూ విభాగానికి మార్చారు. అయితే, నాలుగు రోజులు తల్లికి దూరంగా ఐసియూ వార్డులో ఉన్న శిశువు ఆరోగ్యం కుదుట పడడంతో సోమవారం సాయంత్రం తల్లి ఒడికి చేర్చగా మంగళవారం డిశ్చార్జ్ చేసే క్రమంలోనే వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో తల్లిబిడ్డ నిద్రిస్తున్న సమయాన్ని గమనించిన నిందితులు చాకచక్యంగా చీకట్లో మగ శిశువును అపహరించుకునేందుకు పథకం రూపొందించారు. ఆదిలాబాద్‌కు చెందిన నగేష్ గతంలో రిమ్స్‌లో డైట్ వార్డులో చిరు ఉద్యోగిగా పనిచేయగా నగేష్ భార్య పుష్పలత గతంలో రిమ్స్‌లోనే ఏఎన్‌ఎం శిక్షణ పొంది బయట ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆసుపత్రిలో మమత నిద్రపోతున్న విషయాన్ని గమనించి నగేష్ చాకచక్యంగా పసికందును తీసుకొని కిటికీలో నుండి భార్య పుష్పలతకు అందజేశాడు. అరగంటలోపే పక్కలో బిడ్డ కనిపించకపోవడంతో తల్లి రోదిస్తూ ఆసుపత్రికి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసి శిశువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేరడిగొండ టోల్‌ప్లాజా వద్ద ఎస్సై హరిశేఖర్ కాపుకాసి వాహనాలు తనిఖీ చేస్తుండగా నిజామాబాద్ వైపు వెళ్తున్న పేపర్ వాహనంలో ఓ మహిళ చేతిలో పసికందును గమనించి ఆరా తీశారు. అపహరించుకు వెళ్తున్నట్లు నిర్దారణ కావడంతో దంపతులైన నిందితులు నగేష్, పుష్పలతను అరెస్ట్ చేసి బిడ్డను రిమ్స్ ఆసుపత్రిలోని తల్లి ఒడికి చేర్చి పోలీసులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. బిడ్డ సురక్షితంగా రెండు గంటల్లోనే తన ఒడికి చేరడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ. మగ శిశువును విక్రయించేందుకే నిందితులు పథకం ప్రకారం కిడ్నాప్‌కు ప్రయత్నించి చివరకు కటకటాల పాలైన సంఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

చిత్రం..అపహరణకు గురైన శిశువును తల్లికి అప్పగిస్తున్న
ఎస్పీ విష్ణు ఎస్ వారియర్