తెలంగాణ

దేశవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 10: దేశవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి నెలకొందని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ అన్నారు. మంగళవారం స్థానిక ఇందిరా భవన్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్థిక, సామాజిక, విదేశీ వ్యవహరాల్లో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం మోదీ విస్మరించారని విమర్శించారు. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా కేసీఆర్ పాలన నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మహిళా ప్రాతినిథ్యం లేని ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అన్నారు. టీఆర్‌ఎస్ రాజకీయాలకు దీటుగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను వచ్చే ఎన్నికల నాటికి సన్నద్ధం చేస్తామని తెలిపారు. బూత్ కమిటీలు కూడా ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని, బేదాభిప్రాయాలు పక్కన పెట్టి పార్టీ గెలుపునకు అందరూ కృషిచేయాలని శ్రీనివాసన్ కృష్ణన్ పిలుపునిచ్చారు. సీఎల్పీ ఉప నేత, జగిత్యాల ఎమ్మెల్యే టీ.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ హమీల అమలులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గురించి మంత్రి కేటీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేటీఆర్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే మా లక్ష్యమని ప్రకటించారు. డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణగౌడ్, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, చింతకుంట విజయరమణారావు, నాయకులు చల్మెడ లక్ష్మీనర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..కరీంనగర్ సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాసన్ కృష్ణన్