తెలంగాణ

హిందూవాహిని ర్యాలీకి అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జూలై 10: పరిపూర్ణానందస్వామి గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ హిందూవాహిని ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొని కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓ ప్రసార సాధనంలో కత్తి మహేష్ హిందువుల మనోభావాలను దెబ్బతినేలా శ్రీరాముడిని కించపర్చేలా మాట్లాడటాన్ని నిరసిస్తూ పరిపూర్ణానందస్వామి పాదయాత్ర చేసేందుకు పోలీసులు అనుమతి తీసుకుని యాదాద్రికి బయలుదేరుతున్న సమయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే స్వామీజీని గృహ నిర్బంధం చేసిందని హిందూవాహిని ఆధ్వర్యంలో పలువురు ఆరోపించారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ నాగర్‌కర్నూల్ పట్టణంలోని శ్రీరామస్వామి దేవాలయం ఆవరణ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సోమవారం సాయంత్రం పోలీసులు అనుమతి తీసుకున్నట్లు హిందువాహిని నేతలు రాజ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షులు దొడ్ల నారాయణరెడ్డి తదితరులు తెలిపారు. మంగళవారం ఉదయం దేవాలయం వద్దకు చేరుకోగా డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై భగవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు దేవాలయం వద్దకు చేరుకొని ర్యాలీకి అనుమతిలేదంటూ హిందువాహిని నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో మైక్‌పెట్టుకోగా పోలీసులు వాటిని బలవంతంగా తొలగించారు. హిందూవాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు హిందూ ధర్మజాగరణ సమితి ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు శ్రీనివాసనందా స్వామి, బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పుష్పలీల, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షులు దొడ్ల నారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు బుసిరెడ్డి సుబ్బారెడ్డిలతోపాటు వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, ఎబీవీపీ నేతలు పాల్గొన్నారు. దేవాలయంలో సమావేశం నిర్వహించిన అనంతరం ర్యాలీ చేసేందుకు దేవాలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే అప్పటికే దేవాలయం ఆవరణను చుట్టుముట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పుష్పలీలకు, డీఎస్పీ లక్ష్మీనారాయణకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే ఎందుకు అరెస్టు చేస్తున్నారని, హిందువుల మనోభావాలను దెబ్బతిసేలా వ్యవహరించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసులు హిందువుల చైతన్యం కోసం నిర్వహించే ర్యాలీని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దేవాలయంలో మైక్‌ను తొలగించే అధికారం ఎవ్వరు ఇచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో డీఎస్పీ వారిని నచ్చచెప్పి పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అందరి వివరాలను సేకరించి వ్యక్తిగత పూచీకత్తుపై వారందరిని విడుదల చేశారు.
చిత్రం..నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో హిందువాహిని నేతలు