తెలంగాణ

వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల సందర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూలై 10: మూడు రోజులుగా కుదిపేసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మంగళవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వరద తాకిడి ప్రాంతాలను సందర్శించి, యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా పెన్‌గంగా పరివాహక ప్రాంతాలైన బేల మండలంలోని మనియార్‌పూర్, దేవెగాం గ్రామాలను సందర్శించి నీట మునిగిన పంట పొలాలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లను మంత్రి రామన్న సందర్శించారు.
వంతెన పైనుండి వెళ్తున్న వరద నీటి ప్రవాహన్ని దాటిన మంత్రి లోలెవల్ వంతెన పైనుండి భారీగా వెళ్తున్న వరద నీటిని పరిశీలించారు. తమ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయని, గ్రామమంతా వరద నీటితో జలమయంగా మారిందని గ్రామస్తులు తెలిపారు. పలు గ్రామాలకు వరద ముంపు నెలకొన్న నేపథ్యంలో లోలెవల్ వంతెనల స్థానంలో హైలెవల్ వంతెన నిర్మాణం చేపట్టి వరద నీటిని మళ్ళిస్తామని, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వర్షాకాలంలో వరద నీరు నిలిచి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందునా పారిశుద్ద్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్నారం మండలం ఇందన్‌పెల్లి వద్ద వరద తాకిడికి తెగిపోయిన అప్రోచ్ వంతెనను పరిశీలించారు. ప్రతి ఏటా వర్షాకాలంలో వంతెన తెగిపోవడం, వందలాది వాహనాలు నిలిచిపోవడం, ప్రజలు ఇక్కట్లకు గురికావడం సహాజంగా మారిందని, కొత్త వంతెన నిర్మాణ పనుల నిర్లక్ష్యం పట్ల సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలకు రవాణా సంబంధాలు తెగిపోయినందునా వెంటనే యుద్దప్రాతిపదికన పనులు చేపట్టి, రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని మంత్రి ఆదేశించారు. అనంతరం కడెం ప్రాజెక్టు రిజర్వాయర్ నీటి మట్టాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.

చిత్రం..ఇందన్‌పెల్లి వద్ద తెగిపోయిన అప్రోచ్ వంతెనను పరిశీలిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్