తెలంగాణ

ఎమ్సెట్ రెండో దశ సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: తెలంగాణలో రెండో దశ ఎమ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీం సీట్ల కేటాయింపు ప్రక్రియను గురువారం నాడు పూర్తి చేసినట్టు కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. కన్వీనర్ కోటాలో 69,221 సీట్లు ఉండగా, రెండోదశ కౌనె్సలింగ్ సమయానికి 31,082 సీట్లు ఖాళీగా ఉన్నాయని, రెండో దశ కౌనె్సలింగ్ అనంతరం 51,345 సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. రెండో దశలో కొత్తగా సీట్లు పొందిన వారు 13,206 మంది ఉన్నారని, వీరితో కలిపి మొత్తం 17,876 మంది సీట్లు పొందారని పేర్కొన్నారు. 14,595 మంది మెరుగైన బ్రాంచిలకు స్లైడింగ్ అయ్యారని ఆయన వివరించారు. ఇంజనీరింగ్‌లో 14 యూనివర్శిటీ కాలేజీల్లో 3075 సీట్లకు 3026 సీట్లుభర్తీ అయ్యాయని, ఇంకా 31 సీట్లు మిగిలే ఉన్నాయని అన్నారు. అలాగే ప్రైవేటులో 175 కాలేజీలలో 62591 సీట్లు ఉండగా, 48,131 సీట్లు భర్తీ అయ్యాయని, ఇంకా 14,460 సీట్లు మిగిలి ఉన్నాయని వివరించారు. బి ఫార్మసీలో 3 యూనివర్శిటీ కాలేజీల్లో 23 సీట్లు భర్తీకాగా మరో 57 ఉన్నాయని, 110 బి ఫార్మసీ కాలేజీల్లో 3007 సీట్లకు 118 సీట్లు భర్తీ అయ్యాయని, ఫార్మా డీలో 49 కాలేజీల్లో 486 సీట్లకు 47 సీట్లు భర్తీ అయ్యాయని అన్నారు.
రెండు కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు
రెండు కాలేజీల్లో ఒక్కరూ చేరలేదని, ఏడు కాలేజీల్లో 9లోపు విద్యార్ధులు చేరారని, 24 కాలేజీల్లో 50లోపు విద్యార్ధులు మాత్రమే చేరారని, 43 కాలేజీల్లో 100లోపు విద్యార్ధులు చేరారని నవీన్ మిట్టల్ చెప్పారు. 100 శాతం అడ్మిషన్లు జరిగిన కాలేజీల్లో 48 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయని చెప్పారు. అభ్యర్ధులు 15వ తేదీ కంటే ముందు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని, 16వ తేదీ నుండి క్లాసులు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు.
మరో కౌనె్సలింగ్
మిగిలిన సీట్లకు మరో కౌనె్సలింగ్ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే రెండో దశ కౌనె్సలింగ్ ముగిసిన తర్వాత విద్యార్ధుల చేరిక ప్రాతిపదికన మిగిలిన సీట్ల భర్తీకి ఏం చేయాలనేది నిర్ణయించనున్నట్టు తెలిసింది.