తెలంగాణ

ఆర్థిక సాయం అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 12: నగరంలోని 4వ తేదీ కోటిలింగాల వద్ద ఉన్న భద్రకాళీ ఫైర్ వర్క్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన 10మంది మృతుల కుటుంబాలకు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబానికో 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు ఒక్కో కుటుంబానికి డబుల్‌బెడ్‌రూం ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసారు. అంతే కాకుండా బాంబు పేలుళ్ల సందర్భంగా దెబ్బతిన్న చుట్టుపక్కల ఇళ్లవారికి కూడా డబుల్‌బెడ్‌రూం ఇళ్ల మంజూరు పత్రాలను అందచేసారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ దురదుష్టవశాత్తు అగ్నిప్రమాదంలో 10మంది చనిపోవడం విచారకరమని అన్నారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, చనిపోయిన కుటుంబంలోని పిల్లలకు చదువుల చెప్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని అన్నారు. ఈఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతోనే చికిత్స అందిస్తుందని అన్నారు. అదే విధంగా వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు 20వేల నగదును కడియం శ్రీహరి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు అమ్రపాలి, హరిత, పోలీసు కమిషనర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బాంబు పేలుళ్ల బాధిత కుటుంబాలకు
ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్న డీప్యూటీ సీఎం కడియం