తెలంగాణ

నీటి పారుదల ప్రాజెక్టులపై శే్వతపత్రం విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: భారీ నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం శే్వత పత్రం విడుదల చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూర్ సభ్యుడు రావుల చంధ్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎన్‌టీఆర్ ట్రస్ట్భ్‌వన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 34 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, అందులో టీడీపీ హయాంలో ప్రారంభించినవి సైతం ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టులకు రీ-డిజైనింగ్ చేయడంతో వ్యయం భారీగా పెరిగిందన్నారు. అధికారులు, ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టుల వ్యయం పెరుగుతూ పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. 83వేల కోట్లతో ఆగకుండా వూర్తి అయ్యేనాటికి లక్ష కోట్లు దాటే అవకాశం ఉందన్నారు. ఇటీవల తమ్మిళ్ల ఎత్తిపోతలను పరిశీలించిన ముఖ్యమంత్రి వెంటనే రీ డిజైనింగ్ చేయాలని అధికారులతో చెప్పగా ఇప్పటికే రూ.4వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పినా వినకుండా మార్చాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రజలపై పను భారం పడనుందన్నారు.