తెలంగాణ

మధుపై తప్పుడు కేసులు అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మధును అరెస్టు చేసిందని, దీనిని ప్రజాస్వామ్య వాధులందరూ ఖండించాలని న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ. కృష్ణ అన్నారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు జరుగుతున్న కుట్రలను చేధించాల్సిన అవసరం ఉందని అన్నారు. తప్పుడు ఆరోపణలు మోపి వరంగల్ -కొత్తగూడెం రీజనల్ కమిటీ కార్యదర్శిని మధును అరెస్టు చేసి పోలీసులు అతన్ని చిత్రహింసలకు గురిచేశారని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాడే విప్లవకారులను బందీలుగా చేయడం, జైళ్లల్లో మగ్గేటట్లు సాక్ష్యాలను ప్రవేశపెట్టడం, ప్రజా ఉద్యమాలను నీరుకార్చే ప్రక్రియగా భావించాలని అన్నారు.