తెలంగాణ

గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: గిరిజన పారిశ్రామికవేత్తలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోయల్ ఓరమ్ అన్నారు. గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న కార్యక్రమాలకు కూడా చేయూత ఇస్తున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జాతీయ గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి ఓరమ్ మాట్లాడుతూ గిరిజన పారిశ్రామికవేత్తల ప్రోత్సహానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్న రాయితీలు, ప్రోత్సహాకాలను వివరించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ గిరిజనుల్లో నైపుణ్యం పెంపొందించడానికి పెట్టుబడి రాయితీ ఇస్తున్నామన్నారు. గిరిజన మహిళలకు 45 శాతం, పురుషులకు 35 శాతం పెట్టుబడి రాయితీ కల్పించామన్నారు. అలాగే కాంట్రాక్టు పనుల్లో గిరిజనుల ప్రత్యేకంగా కోటా పెట్టామన్నారు. డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ కింద ఒక్కో కారుపై రూ. ఐదు లక్షల రాయితీ ఇస్తున్నామన్నారు. గిరిజర రైతులకు 95 శాతం రాయితీతో ట్రాక్టర్లు అందిస్తున్నామన్నారు. డ్రిప్, గ్రీన్ హౌస్ స్కీమ్‌లో వంద శాతం రాయితీ కల్పించామన్నారు. సివిల్ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. వ్యవసాయ పరికరాలలో గిరిజన రైతులకు 95 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. బడా పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రుణాలు ఇచ్చే బ్యాంకులు, చిన్నా, మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు మాత్రం రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని మంత్రి ఈటల విమర్శించారు. రాష్ట్రంలో 85 శాతం ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలే ఉన్నారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్, ఎంపి సీతారామ్ నాయక్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడు, ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.