తెలంగాణ

ప్రజల జీవితాలలో వెలుగు నింపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: పరిశోధనా సంస్థలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రజలతో మమేకం కావాలని, ఒంటరిగా ఉండరాదని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన నిజాంపేట ప్రగతి నగర్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శాస్తవ్రేత్తలతోనూ ముచ్చటించారు. సంస్థ ఆవరణలో ఉన్న సునామి హెచ్చరిక కేంద్రాన్ని కూడా సందర్శించారు. ఈసందర్భంగా ఆయన సుదీర్ఘంగా మాట్లాడుతూ తీరప్రాంతంలోని 5.79 లక్షల మంది మత్స్యకారులకు ఇనకాయిస్ చేస్తున్న సేవలను అభినందించారు. ఇన్‌కాయిస్ సాంకేతిక పరిజ్ఞానం, జ్ఞాన వికాసం వల్ల ఎంతో మంది మత్స్యకారులకు మేలు జరుగుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో ఇన్‌కాయిస్ మరింత మెరుగైన శాస్త్ర సాంకేతక పరిజ్ఞానాన్ని అలవరచుకుని సునామికి సంబంధించి స్పష్టమైన సమాచారంతో 3డి చిత్రపటాలను రూపొందించాలని పేర్కొన్నారు. అంతకుముందు భారత ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు హైదరాబాద్ చేరుకున్నపుడు ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ , పోలీసు, రెవిన్యూ, సైనిక అధికారులు ఘనస్వాగతం పలికారు. శనివారం ఆయన వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళ్తారు.