తెలంగాణ

ఇంటర్ విద్యకు కొత్త రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యకు కొత్త రూపాన్ని ఇచ్చామని, అన్ని సర్వీసులను ఆన్‌లైన్ చేశామని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లొ సకల సౌకర్యాలను కల్పించామని బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు శుక్రవారం నాడు ఆయన బంగారు పతకాలను, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్ విద్యకు కొత్త రూపాన్ని ఇచ్చామని, అన్ని కాలేజీల్లో బోధన సిబ్బందితో పాటు ల్యాబ్ లైబ్రరీ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి, కంట్రోలర్ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీరోడ్ జీజేసీలో చదువుతున్న సెకండియర్ విద్యార్థిని మేథాజూలూరి (98.5 శాతం), కొహెడ జీజేసీ విద్యార్ధిని కుంభం రమ్య (98.2), బోథ్ జీజేసీ కంఠం హారిక (97.8 శాతం)లకు బంగారుపతకాలు అందజేశారు. బంగారు పతకాలతో పాటు నగదు పురస్కారం, ప్రశంసా పత్రం ఇచ్చారు. ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందుకున్న వారిలో గ్రూప్‌ల వారీ టాపర్లలో బోడ్డపూరి వైష్ణవి (97.7), రేష్మా జాహన్ బేగం (96.2), ఎ స్పందన (96.2), బి కృష్ణ (96.5), ఎల్ సంధ్య (93.4) ఉన్నారు. వొకేషనల్ కోర్సుల్లో టాపర్లుగా నిలిచిన వారిలో ఎన్ జగదీష్, మక్కా శ్రీకాంత్, పెండ్యం శశిప్రియ ఉన్నారు. ఫస్టియర్‌లో బి సానియా, పి వైష్ణవి, మహ్మద్ బేగం, దూస రమ్య, జి జాన్సన్, ఎం అనూష, ఎం గంగాభవాని, ఎం జయగుణ, ఇ లావన్య ఉన్నారు.
లక్ష్యంపై గురి ఉండాలి: సివిల్స్ టాపర్
మనం ఏ పనిచేసినా, చివరికి వినోద కార్యక్రమంలో ఉన్నా మన లక్ష్యంపైనే గురి ఉండాలని దాని గురించే ఆలోచించాలని సివిల్స్‌లో 624వ ర్యాంకు సాధించిన వై అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు. గీతం డీమ్డ్ వర్శిటీలో నిర్వహించిన విద్యార్థుల ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ఏదైనా ఎంత కఠోర దీక్షతో చేస్తున్నామనేదానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సివిల్స్‌కు ప్రిపేరైన తీరును వివరించారు. ముందుగా గీతం విద్యార్థి వ్యవహారాల సంచాలకుడు ప్రొఫెసర్ ఎ శ్రీరామ్ అతిథిని సత్కరించగా, గీతం విద్యార్థి విభాగం ‘దిశ’ సమన్వయకర్త డాక్టర్ జోసఫ్ జయకర్ దాని లక్ష్యాలను వివరించారు.
లా బ్యాచ్ ప్రారంభం
ఇక్ఫాయి లా కాలేజీలో శుక్రవారం నాడు న్యాయవిద్యా కోర్సులను అభ్యసించే కొత్త బ్యాచ్ క్లాసు వర్కు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (మాజీ) జస్టీస్ బి ప్రకాశరావు హాజరయ్యారు. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టీస్ యతిరాజులు, ఇక్ఫాయి గ్రూప్ సలహాదారు ప్రొఫెసర్ వై హరగోపాల్‌రెడ్డి , నల్సార్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి , బ్రాండింగ్ డైరెక్టర్ సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ వర్శిటీ అర్హత పరీక్ష
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ రెండోమారు ఈ నెల 22న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్టు వర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షకు హాజరుకాదలచిన వారు ఆన్‌లైన్ ద్వారా 310 రూపాయిలు రిజిస్ట్రేషన్ ఫీజు ఈ నెల 16వ తేదీలోగా చెల్లించాలని పేర్కొన్నారు.