తెలంగాణ

ఇండో-యూఎస్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్తచ్రికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తీవ్రమైన గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్న ఓ వృద్దురాలికి ఇండో-యూఎస్ ఆసుపత్రి వైద్యులు అత్యంత అరుదైన గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. శుక్రవారం నగరంలో ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను శస్తచ్రికిత్స నిపుణులు శేషగిరి రావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాపర్తినగర్‌కు చెందిన 81 ఏళ్ల అనసూర్యమ్మ తీవ్ర గుండె నొప్పికి గురికాగా కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ అమీర్‌పేటలోని ఇండో- యూఎస్ ఆసుపత్రికి తరలించారు. అనసూర్యమ్మను పరీక్షించగా గుండెకు సంబంధించి కుడి దమని పూర్తిగా మూసుకుపోగా, ఎడమవైపు 95శాతం మూసుకుపోయినట్టు నిర్ధారించా. రక్తసరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంతో రోగి మృత్యువుకు చేరువ అయిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా చోటుచేసుకుంటోందని, ఒక వైపు నాళాలు మూసుకుపోవడం సాదారణంగా కనిపిస్తోందని చెప్పారు. వెంటనే యాంజియోప్లాస్టీ ద్వారా ఎడమ దమనిని సరిచేయగా కుడి వైపు బైఫర్‌కేషన్ స్టెంటింగ్ చేసినట్టు తెలిపారు.
శస్తచ్రికిత్స పూర్తి అయిన మూడు రోజులకు అనసూయమ్మ గుండెలో రంధ్రం పడటంతో మరోమారు శస్తచ్రికిత్స నిర్వహించి ఆమె ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు. 81ఏళ్ల వృద్దురాలికి ఈ తరహా ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడం ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా చెప్పవచ్చునని అన్నారు. ఈ సమావేశంలో వైద్యులు శివప్రసాద్, శివకృష్ణ పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో శుక్రవారం విలేఖరుల సమావేశంలో శస్తచ్రికిత్స వివరాలను వెల్లడిస్తున్న డాక్టర్ శేషగిరిరావు