తెలంగాణ

బోధన్ చైర్మన్‌పై అవిశ్వాసానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బోధన్ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్యపై ఇచ్చిన అవిశ్వాస నోటిసును వెనక్కి తీసుకోవడానికి కౌన్సలర్లు అంగీకరించారు. టిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన కౌన్సలర్లు మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసానికి నోటీసు ఇవ్వడంతో నిజామాబాద్ ఎంపి కవిత రంగంలోకి దిగారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీతో శుక్రవారం కవిత భేటీ అయ్యారు. అవిశ్వాస నోటీసు ఇచ్చిన వారిలో ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా ఉండటంతో ఆ విషయాన్ని పార్టీ అధినేత అసదుద్ధీన్ ఓవైసీ దృష్టికి తీసుకొచ్చారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో అవిశ్వాస నోటీసు ఇవ్వడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ప్రత్యర్థి పార్టీలు అనుకూలంగా మలుచుకుంటాయని కవిత వివరించారు. కవిత అభిప్రాయంతో ఏకీభవించిన ఓవైసీ తమ పార్టీ కౌన్సిలర్లను ఒప్పించి నోటీసుకు మద్దతు ఇవ్వకుండా చూస్తానని హామీ ఇచ్చారు. బోధన్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ కూడా ఈ సమావేశంలో ఉండటంతో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కౌన్సలర్లను తాను కూడా ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. టిఆర్‌ఎస్, ఎంఐఎం కౌన్సిలర్లను పార్టీ నేతలు బుజ్జగించడంతో అవిశ్వాస తీర్మానాన్ని ఉప సంహరించుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో బోధన్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం అంశం సుఖాంతం అయంది.
చిత్రం..హైదరాబాద్‌లోని ఎంఐఎం కార్యాలయంలో ఆ పార్టీ అధినేత
అసదుద్దీన్ ఒవైసీతో భేటీ అయన నిజామాబాద్ ఎంపీ కవిత