తెలంగాణ

హరితహారానికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వ శాఖలు సన్నద్ధం అవుతున్నాయి. నాల్గొవ విడత హరితహారంలో 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. అందుకు అనుగుణంగా అటవీ శాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే మూడు విడతలుగా సాగిన కార్యక్రమాల్లో 81.60కోట్ల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24 శాతం పచ్చదనాన్ని 33శాతానికి పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడంతో అడవుల సంరక్షణకు ఇది ఎంతగానో తోడ్పాటును అందించనుంది. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలజీ దేవాలయం నుంచి తెలంగాణకు హరితహారాన్ని ప్రారంభించారు. మొదటి ఏడాది వాతావరణం అనుకూలించక పోవడంతో కేవలం 15.86 కోట్ల మొక్కలు నాటారు. తదుపరి రెండేళ్లు నిర్ధేశించుకున్న లక్ష్యాల ప్రకారం భారీగా మొక్కలు నాటారు. 2016-17లోవిజయవాడ హైవేపై ఒకే రోజు 163 కిలోమీటర్ల పొడవునా మానవహారంగా హరితహారాన్ని నిర్వహించి రికార్డు సృష్టించారు. ఇలా నాటిన మొక్కల్లో 80శాతం వరకు సజీవంగా ఉన్నట్టు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది నిర్వహించే తెలంగాణకు హరితహారంలో టేకు, వెదురు, ఈత మొక్కలతో పాటు పూల మొక్కలకు అధిక ప్రాధాన్యం ముఖ్యమంత్రి ఆదేశించడంతో అందుకు తగ్గట్టుగా రాష్టవ్య్రాప్తంగా ఉన్న నర్సరీల్లో ఆయా మొక్కలను సిద్ధం చేశారు. త్వరలో భూపాల్‌పల్లి జిల్లా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో భావి తరాల కోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పచ్చదనంతో పాటు కాలుష్య రహిత సమాజానికి చెట్ల ప్రాధాన్యతలు వివరించే విధంగా విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులకు వ్యాస, వకృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయిందింది.
వీటితో పాటు ప్రతి విద్యార్థికి ఐదు మొక్కలు ఇచ్చి వాటిని నాటి సంరక్షించే బాధ్యతలు అప్పగించనున్నారు.