తెలంగాణ

ఎంతఘాటు ప్రేమయో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, జూలై 13: ఆయనకు 80 ఏళ్లు.. భార్య రెండేళ్ల క్రితం కన్ను మూసింది.. ఆమెకు 55 ఏళ్లు.. ఆమె భర్త మూడేళ్ల క్రితం అనారోగ్యంతో కన్ను మూసాడు. ఇద్దరికీ సంతానం ఉన్నా ఎవరు పట్టించుకోక పోవడంతో తోడు కోసం వెతుకులాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరికీ పరిచయం ఉన్న ఓ వ్యక్తి వీరిద్దరిని ఒక్కటి చేసేందుకు నాలుగు మాసాల క్రితం పరిచయం చేశాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. పెళ్లి చేసుకొని జంటగా మారేందుకు నిర్ణయించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ఓ దేవాలయంలో ఆ ఇద్దరు వివాహం చేసుకొని ముదిమి వయస్సులో కొత్త జీవితాన్ని ఆరంభించారు. ముదిమి వయసులో ఘాటు ప్రేమ, పెళ్లి ఘటనకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి.
కేసముద్రం మండలం వెంకటగిరి శివారు చంద్రుతండాకు చెందిన బీల్యానాయక్‌కు 80 ఏళ్లు. భార్య జంకీ రెండేళ్ల క్రితం చనిపోయింది. బీల్యాకు ఆరుగురు కుమార్తెలు, ఐదుగు రు కుమారులున్నారు. అయితే భార్య చనిపోయిన తరువాత కొడుకులు, కుమార్తెలు బీల్యా ఆలనపాలన చూడటం లేదని, తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని భీష్మించాడు. దీనితో ఈ వయసులో నీకు పెళ్లేంటని అడ్డుకున్నారు. అయినా బీల్యా తన పట్టువదలకుండా పెళ్లి చేసుకోవడానికి సంబందాలు చూడటం మొదలెట్టాడు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారు తండాకు చెందిన 55 ఏళ్ల బుజ్జి కూడా భర్త చనిపోవడం, ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేయడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె కూడా తోడు కోసం వెతుకుతుండటంతో ఇద్దరిని ఓ వ్యక్తి పరస్పరం పరిచయం చేయగా, ఇద్దరి మనసులు ఒక్కటయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కేసముద్రం మం డల కేంద్రంలో దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. వధువుకు 40 వేల విలువైన బంగారు నగలు కానుకగా ఇవ్వడంతో పాటు స్వగ్రామానికి వెళితే కొడుకులు, కొడళ్లు, కుమార్తెలతో ఇబ్బందులుంటాయని తలచి మండల కేంద్రంలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ‘ముదిమి దంపతులు’ గృహ ప్రవేశం కూడా చేయడం విశేషం. కాగా బీల్యానాయక్ ఇంటికనె్న గ్రామానికి ఓ టర్ము సర్పంచ్‌గా చేయడం మరో విశేషం. ఎవరేమనుకున్నా ఫర్వాలేదు.. తమ చివరి గడియల్లో తోడు..నీడ కోసం ఇద్దరం ఒక్కటయ్యామని చెప్పడం గమనార్హం.

చిత్రం..వివాహం చేసుకుని దండలు మార్చుకుంటున్న బీల్యా, బుజ్జీ