తెలంగాణ

రైతుల కోసమే గిట్టుబాటు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జూలై 13: రైతుల అభివృద్ధి కోసం వారు పం డించే వివిధ పంటలకు గిట్టుబాటు ధరను గణనీయంగా పెంచామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం చెప్పారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ పేరుతో అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో రైతులు రుణాల కోసం బ్యాంకులకు వెళ్లకుండా ఉండే పరిస్థితులు తీసుకురావడానికి ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్టక్రు వెళ్తున్న ఆయన మార్గమధ్యలో ఆర్మూర్‌లోని రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో శుక్రవారం రాత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి నిధులతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు పోగా మిగిలిన నిధులతో ఉచితం పేరుతో ప్రజలకు పంచి పెడుతోందని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సూచనలను అమలు చేస్తుండడంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు సైతం తమ పాలనను విమర్శించడానికి ఆస్కారం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. నాలుగేళ్ల బీజేపీ పాలనలో అమలు చేస్తున్న పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చామని అన్నారు. అందువల్లే దేశ వ్యాప్తంగా ప్రజలు నరేంద్ర మోదీకి నీరాజనం పలుకుతున్నారని, మోదీ వెంటే దేశ ప్రజలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే కాకుండా రైతుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని అన్నారు. నాలుగేళ్లలో ఏనాడూ విత్తనాల ధరలను పెంచలేదని ఆయన చెప్పారు. జనాభా ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలకు సమానంగా అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తున్నామని, ఏ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని ఆయన పేర్కొన్నారు. దేశ సరిహద్దుల రక్షణతో పాటు దేశ అంతర్గత భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. కశ్మీర్‌ను కాపాడుకోవడమే కాకుండా చైనా, పాకిస్తాన్‌లకు బుద్ధి చెప్పామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు లోక భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.