తెలంగాణ

పారదర్శకంగా పాడిగేదెల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: పాడి రైతులకు సబ్సిడీపై గేదెలను అందించే బృహత్తర కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు రాష్ట్ర పశు సంవర్థక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాడిరైతుల గుర్తింపు, పంపిణీ, గేదల కొనుగోలు, వంటి తరలింపు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ డెయిరీలకు పాల సరఫరా చేస్తున్న 2.13లక్షల మంది రైతులకు గేదలను అందించనున్నట్టు చెప్పారు. మొదటి విడతలో 15వేల మంది పాడిరైతులకు గేదల పంపిణీ ఉంటుందని చెప్పారు. రూ. 80వేలతో కొనుగోలు చేయనున్న గెదలకు ఎస్సీ, ఎస్టీలకు 75శాతం, బీసీలకు 50శాతం రాయితీతో అందిస్తామన్నారు. గేదలను హర్యానా, పంచాబ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కొనుగులు చేయనున్నామన్నారు. ఆయా రాష్ట్రాల్లో అధికారులు పర్యటించి గేదల లభ్యత, నాణ్యతలను పరిశీలించి వచ్చారని తెలిపారు. వైద్యులు, అధికారులతో పాటు లబ్దిదారులను తీసుకువెళ్లి కొనుగోల్లు జరపనున్నట్టు చెప్పారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా పాలను ఇక్కడ ఉత్పత్తి చేసుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు.