తెలంగాణ

రైతు బీమా అమలులో మరింత వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 14: దేశంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం అమలును అధికార యంత్రాంగం, రైతు సమన్వయ సమితి సభ్యులు వేగవంతం చేయాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్‌లో రైతుబీమా పథకం అమలు ప్రగతిని ఆయన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి సమీక్షించారు. జిల్లాలో రైతుబీమా పథకంలో రైతుల నమోదు ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా రైతుబీమా నామినీ నమోదు ఫారాలను పూర్తి చేసి ఆగస్టు 15నుండి చేపట్టనున్న రైతుబీమా పత్రాల పంపిణీకి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో 57లక్షల మంది రైతులకు రైతుబీమా పథకం అమలు చేయనుండగా గత 20రోజులుగా 33లక్షల 98వేల మంది రైతులను ఏఈవోలు, రైతు సమన్వయ సమితి సభ్యులు సంప్రదించి వారిలో అర్హత ఉన్న 26లక్షల మందికి నామినీ ఫారాలు అందించారన్నారు. ఆగస్టు 15నుండి బీమా పత్రాల పంపిణీ పండుగలా సాగుతుందన్నారు. 18నుండి 59సంవత్సరాలు వయసున్న రైతులందర్నీ భూరికార్డుల వివాదాలతో నిమిత్తం లేకుండా రైతుబంధు చెక్కులు కలిగిన వారిని బీమాలో నమోదు చేస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా 50ఏళ్ల పరిమితితో, సురక్ష బీమా యోజన ప్రమాదవశాత్తు బీమాకే పరిమితమవ్వగా రైతుబీమా పథకం మాత్రం దేశంలో ఎక్కడా లేని రీతిలో సహజ మరణానికి కూడా వర్తిస్తుందన్నారు. రైతులంతా ముం దు జాగ్రత్తగా బీమా పథకంలో చేరాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతుసమన్వయ సమితి సభ్యులు రైతులను బీమా పథకంలో చేర్పించడంలో చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రైతుసమన్వయ సమితి కో-ఆర్డినేటర్ రామచంద్రనాయక్, జిల్లా వ్యవసాయ అధికారులు హుస్సెన్‌బాబు, శ్రీనివాస్‌లు, ఏడీలు, ఏవోలు, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

చిత్రం..రైతు బీమా పథకం సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి