తెలంగాణ

ఉద్యమ ఆకాంక్షను విస్మరించిన సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ చార్మినార్, జూలై 14: కేసీఆర్ సర్కారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమ ఆకాంక్షను విస్మరించిందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే.నాగేశ్వర్, సీనియర్ పాత్రికేయులు ఎన్.వేణుగోపాల్ విమర్శించారు. ‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష-వర్తమాన పరిస్థితులు’ అంశంపై శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీజేఏసీ నిర్వహించిన సమావేశానికి వారు ప్రధాన వక్తలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ దేశంలో మన రాష్ట్రంలోనే చిన్న వయస్సులో భర్తలను కోల్పోయిన వితంతువుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇందుకు నిరక్షరాస్యత, బాల్య వివాహాలే కారణమని, ఇలాంటి పరిస్థితులను అధిమించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వం మద్యపానాన్ని ఇష్టరాజ్యంగా ప్రోత్సహించటం వల్ల, ఎక్కువ మంది దానికి బానిసై చనిపోతున్నందునే, చిన్న వయస్సులో ఆడవారు వితంతువుగా మిగిలిపోతున్నారని విచారణ వ్యక్తం చేశారు. ఇందుకు నూటికి నూరు శాతం అక్షరాస్యతను సాధించేందుకు విద్యా ప్రమాణాలను పెంచాలని సూచించారు. ప్రభుత్వం పరిమితంగా మద్యపానాన్ని ప్రోత్సహించాలని, ప్రభుత్వమే విక్రయానికి లైసెన్సులు ఇస్తున్నందున, కాలేయ మార్పిడి కోసం ఆరోగ్య శ్రీ స్కీంలో రూ.10లక్షల నుంచి రూ.15 వరకు ఆరోగ్య బీమా కల్పించాలని సూచించారు. రికార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ధనిక రాష్ట్రంగా ఉందని చెబుతున్నా, ప్రజలు మాత్రం ఇంకా పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నారని వివరించారు. పౌష్టికాహార లోపం కూడా రాష్ట్రంలో 45 శాతం వరకుందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినా, నిబద్దత లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా పరిశ్రమలు మూత పడ్డాయని, దీంతో కార్మికులెందరో రోడ్డున పడుతున్నారని వివరించారు. 2012 నుంచి 2018 వరకు రాష్ట్రంలో సుమారు 12శాతం పరిశ్రమలు, సాంకేతిక విద్యాలోపం, పని నైపుణ్యత తగ్గటంతో మూతపడినట్లు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం కౌలు రైతుల కోసం, వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరగటంతో పనిలేక అల్లాడిపోతున్న వ్యవసాయ కూలీల కోసం ఎందుకు ఆలోచించటం లేదని ప్రశ్నించారు. అనేక రకాల ఇబ్బందులున్నా, రైతులు ఇతర వర్గాలకు చెందిన ప్రజలు పాలనపై కనీసం తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు గళం విప్పే పరిస్థితుల్లేవని అన్నారు. సీనియర్ పాత్రికేయులు వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా ఉందా? అని ప్రశ్నించారు. సుదీర్ఘపోరాటం, ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణలో గడిచిన నాలుగేళ్లలో పాలనలో ‘రాక్ దర్బార్’ నడుస్తోందని విమర్శించారు. ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చేరవేసే పత్రికలు,ప్రచార సాధనాల గొంతును సైతం నొక్కేస్తున్నారని వ్యాఖ్యానించారు. నిధులు, నియామకాలు,నీళ్లు అనే మూడు అంశాల ప్రాతిపదికన చేసిన తెలంగాణ ఉద్యమం అనంతరం స్వపరిపాలనలో నీటి ప్రాజెక్టులు కేవలం కాంట్రాక్టులకే పరిమతమయ్యాయని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలున్నాయని చెప్పి, నాలుగేళ్లలో కేవలం 20 నుంచి 30వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ రఘు, కన్వీనర్ పురుషోత్తం, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం టీజేఏసీ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్