తెలంగాణ

పౌరసరఫరాల శాఖలో సౌర విద్యుత్ వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: విద్యుత్తు పొదుపు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోలార్ విద్యుత్తును వినియోగించుకోవాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సోమాజీగూడలోని పౌరసరఫరాల భవన్‌లో 35 లక్షల రూపాయల వ్యయంతో 50 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టును ఆదివారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖలో సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే విధానంలో భాగంగానే ఈ ప్రాజెక్టును నెలకొల్పామని ఆయన తెలిపారు. దీని ద్వారా సంప్రదాయ విద్యుత్తుపై భారం తగ్గుతుందని ఆయన చెప్పారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా శాఖ లాభం చేకూరుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజూ దాదాపు 200 యూనిట్ల చొప్పున నెలకు 6 వేల యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుందని కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు.