తెలంగాణ

రెండు రోజులు భారీ వర్షాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ఉత్తర తెలంగాణలో వచ్చే రెండురోజుల పాటు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమరంబీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్ భూపాల్‌పల్లి, మహబూబాబాద్, భద్రాచలం, ఖమ్మం, మెదక్, సిద్ధిపేట, రాజన్నసిర్సిల్లా, జనగాం, నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నైరుతీ రుతుపవనాలు తెలంగాణతోపాటు కేరళ, కోస్తాంధ్ర, కర్నాటకలలో బలంగా ఉన్నాయని వెల్లడించారు. ఒడిషాలో అల్పపీడన ప్రభావం బలంగా ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 19 న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన వెల్లడించారు. జూలై 20 తర్వాత తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వర్గాలు వెల్లడించాయి. గత 24 గంటల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. పాల్వంచ, చంద్రుగొండ (కొత్తగూడెం) లలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి, అశ్వారావుపేటలలో ఎనిమిది సెంటీమీటర్లు, ముల్కపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం, బూర్గంపాడులలో ఏడేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం, భద్రాచలం, జనగామ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి.