తెలంగాణ

పాడిపరిశ్రమకు పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వృత్తులపై ఆధాపడి జీవనం సాగిస్తున్న వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తోందని అన్నారు.
ఇందులో భాగంగానే నానాటికి ప్రమాదంలో పడిపోతున్న పాడి పరిశ్రమ రంగాన్ని రక్షించేందుకు పాడిగేదల పంపిణీ చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ డెయిరీలకు పాలు సరఫరా చేస్తున్న పాడిరైతులందరికీ సబ్సీడీపై పాడిగేదలను అందించి తీరుతామని అన్నారు. భవిష్యత్ పాల అవసరాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా ఉండేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు.