తెలంగాణ

వీహెచ్ వర్సెస్ వివేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: హెచ్‌సిఎ అధ్యక్షుడు, ప్రభుత్వ అంతర్ రాష్ట్ర సలహాదారు జి. వివేక్‌కు, ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. అసలు ఎలా ప్రారంభమైందంటే.. హెచ్‌సి నుంచి 12 కోట్ల రూపాయలు విశాఖ ఇండస్ట్రీస్ తీసుకున్నదని ఇటీవల విహెచ్ ఆరోపించారు.
దీనిపై వివేక్ శనివారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా స్పందిస్తూ అంబర్‌పేట్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ విహెచ్‌కు మతిస్థిమితం సరిగ్గా ఉన్నట్లు లేదేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. విహెచ్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఒకవేళ విశాఖ ఇండస్ట్రీస్ డబ్బు తీసుకున్నట్లు రుజువు చేస్తే తాను ఆ డబ్బు చెల్లిస్తానని లేకపోతే విహెచ్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
ఇలాఉండగా ఆదివారం విహెచ్ ప్రతిస్పందిస్తూ వివేక్ తనపైనా, ఇతర సభ్యులపైనా తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. డబ్బు పలుకుబడి ఉందని బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదన్నారు. పిల్లల భవిష్యత్తుపై వారికి ఆసక్తి లేదని, హెచ్‌సిఎను రాజకీయాలకు, బిజినెస్‌కు కేంద్రంగా మారుస్తున్నారని ఎదురు దాడి చేశారు.

చిత్రాలు..వి. హనుమంత రావు *జి. వివేక్