తెలంగాణ

పారదర్శక ఎన్నికలతోనే బహుజన రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పారదర్శకమైన ఎన్నికలతోనే దేశంలో బహుజన రాజ్యం సాధ్యమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి అన్నారు. ప్రస్తుత ఎన్నికల విధానంపై ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయని అన్నారు. ఆదివారం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆద్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ఎన్నికల సంస్కరణలు-ఆవశ్యకత, తెలంగాణలో బహుజన ప్రభుత్వం-ఓటరు పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. అంతక ముందు బీఎల్‌ఎఫ్ నేత ఆనంద్ ఆధ్వర్యంలో శంషాబాద్ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీతారామ్‌కు బీఎల్‌ఎఫ్ నేతలు సూర్యప్రకాష్, ఆనంద్, తమ్మినేని వీరభధ్రంలు స్వాగతం పలికారు. బీఎల్‌ఎఫ్ చైర్మన్ నల్లసూర్యప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా సీతారామ్ ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనీ వీరభద్రం, ప్రజాగాయకుడు గద్దర్, టీమాస్ చైర్మన్ కంచె ఐలయ్య, బీఎల్‌ఎఫ్ వైఎస్ చైర్మన్ ఆనంద్ హాజరై ప్రసంగించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అధికారంలో ఉన్న పార్టీల చేతిలో కీలుబొమ్మగా మారుతుండటాన్ని గమనిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం నానాటికి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత మోదీ ప్రభుత్వం కార్పోరేట్ల నుంచి పార్టీ విరాళాలు స్వీకరించే పరిమితిని పూర్తిగా ఎత్తివేయడంతో ఎన్నికల్లో మరింత అవినీతి, అక్రమాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందన్నారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మోదీ లబ్దిపొందాలని చూస్తుండగా, కేసీఆర్ సాధ్యం కాని హామీలతో మరోమారు గద్దెనెక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ దేశానికి దిశానిర్ధేశం చేయనుందని అన్నారు.
బహుజనులందర్ని ఐక్యం చేసి రాజకీయ మార్పుకు శ్రీకారం చుట్టిన బీఎల్‌ఎఫ్ వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో నూతన పార్లమెంట్ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని గద్దర్ అన్నారు. ఇది వామపక్ష పార్టీలతోనే సాధ్యమని, విడివిడిగా ఉంటున్న ఎర్రజెండ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని, అందుకు కృషి చేయాలని సీతారామ్ ఏచూరిని కోరారు.
బహుజన బువ్వ పథకాన్ని తెస్తాం: తమ్మినేని
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి రాగానే రాష్టవ్య్రాప్తంగా బహుజన బువ్వ పథకాన్ని అందుబాటులోకి తెస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఉదయం రూ. 3కే అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రూ.5కే బోజనాన్ని అందించే బహృత్తర కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఇందు కోసం 11వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదాంట్లో ఇది చాలా తక్కువ అని అన్నారు. దీని ద్వారా గ్రామీణులందరికీ కడుపు నిండా బోజనం దొరకడమే కాక, సుమారు లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ‘ఎన్నికల సంస్కరణలు-ఆవశ్యకత, తెలంగాణలో బహుజన చిత్రం..ప్రభుత్వం- ఓటరు పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి