తెలంగాణ

రామగుండం నిప్పుల కుంపటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్/రామగుండం, మే 26: ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రోహిణికార్తెలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓవైపు మండుటెండల దాటికి జిల్లాలో వడదెబ్బ సోకి మృత్యువాత పడుతుంటే మరోవైపు భరించలేని వేడిసెగలు ప్రజల ప్రాణాలను తోడేస్తున్నాయి. గురువారం ఆదిలాబాద్‌లో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా తూర్పు మంచిర్యాలలో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోనూ ఎండలు దంచికొడుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతాల్లో తునికాకు సేకరించే కూలీలు ఎండల దాటికి హడలిపోతుండగా మరోవైపు ఉపాధి కూలీలు కూడా పనులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. సింగరేణి ప్రాంతంలో పశ్చిమ ప్రాంతం కంటే అధికంగా రెండు డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం గమనార్హం. కరీంనగర్ జిల్లా రామగుండంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మునుపెన్నడూ లేనివిధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతలతో పారిశ్రామిక ప్రాంతమంతా కూడా నిప్పులు కక్కుతోంది. సింగరేణి బొగ్గు గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, రామగుండం థర్మల్, ఎన్‌టిపిసి విద్యుత్ కేంద్రాలు, జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల మూలంగా ఇక్కడ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతు ఉంటాయి.